Take a fresh look at your lifestyle.

తెలంగాణ సెట్‌లో మల్లేష్‌కు అర్హత – ప్రిన్సిపాల్ అభినందనలు

 

 

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ :

నాగర్ కర్నూల్: ఇటీవల విడుదలైన తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (SET) ఫలితాల్లో ప్రభుత్వ ఆర్ట్స్ మరియు కామర్స్ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుడిగా పనిచేస్తున్న మల్లేష్ అర్హత సాధించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. గీతాంజలి మల్లేష్‌ను అభినందించారు. భవిష్యత్తులో విద్యార్థులు, సహచర అధ్యాపకులు మరిన్ని విజయాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదిగి కళాశాలకు, ప్రాంతానికి పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఔత్సాహికులకు తమ వంతు సహాయ సహకారాలు, ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు.

ఫలితాలపై మల్లేష్ మాట్లాడుతూ, అందరి  ప్రోత్సాహంతో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.