Take a fresh look at your lifestyle.

మెడికల్ కళాశాలలో కాంట్రాక్టు ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలి – బి ఆర్ టీ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు కృష్ణయ్య

 ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :

వికారాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ కార్మికులకు రావలసిన 9 నెలల పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని జిల్లా అధ్యక్షులు టైగర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. లేదంటే అట్టి నిర్లక్షం చేస్తున్న కాంట్రాక్టర్ లేబర్ లైసెన్స్ ను వెంటనే రద్దు చేసి, బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని, కృష్ణయ్య జిల్లా కార్మిక శాఖా అధికారులను డిమాండ్ చేశారు. తొమ్మిది నెలల నుండి కాంట్రాక్టర్ కార్మికులకు జీతాలు చెల్లించ కుండ ఉంటే వారి కుటుంబాలను ఎలా? పొచించుకుంటారని ? ఇంటి కిరాయిలు, పిల్లల స్కూల్, కాలేజీ, ఫీజులు ఎట్లా కడతారని కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. 9 నెలల తరబడి కాంట్రాక్టర్ జీతాలు చెల్లించ కుండ ఉంటే సంభదిత కాలేజీ ప్రిన్సిపాల్ ఎంచేస్తున్నట్లని? కృష్ణయ్య ప్రవచించారు. కార్మికులకు రెగ్యులర్ గా కాంట్రాక్టర్ జీతాలు, ఈ ఎస్ ఐ, పీఎఫ్ , డబ్బులు చెల్లిస్తున్నారా? లేదా? అని చూసుకోవాల్సిన బాధ్యత కాలేజ్ ప్రిన్సిపాల్ ఎంప్లాయర్ గా కాలేజ్ ప్రిన్సిపాల్ పై ఉంటుందని, కృష్ణయ్య గుర్తు చేశారు. వెంటనే 9 నెలల పెండింగ్ జీతాలను చెల్లించాలని, లేదంటే కార్మికులను కలుపుకొని బి ఆర్ టీ యు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున్న ఆందోళన చేస్తామని కృష్ణయ్య హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.