ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: గృహావసరాలకు, విద్యాలయాలకు, ఆసుపత్రులకు ఎల్.పి.జి సరఫరాలో లోటు రానివ్వము
నాగర్ కర్నూల్ జిల్లాలో సాగు, తాగునీటి సమస్య లేదు పంటలు చేతికి వచ్చే వరకు విద్యుత్, సాగు నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది – జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
జిల్లాలోని గృహావసరాలకు, విద్యాలయాలకు, ఆసుపత్రులకు అవసరమైన ఎల్.పి.జి సిలిండర్ల సమస్య లేదని, అవసరమైన మేరకు సరఫరా చేసేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు.
శుక్రవారం ఎల్.పి.జి సరఫరా, వ్యవసాయ పంటలకు సాగు నీరు, తాగు నీరు, విద్యుత్ కు సంబంధించి రాబోయే రోజుల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు అధ్యక్షతన జిల్లా కలెక్టర్లతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ఇరిగేషన్, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని సమీక్ష నిర్వహించారు.
ఇరాన్ పై యుద్ధం, హర్మూజ్ గుండా రావాల్సిన చమురు నౌకలు ఆగిపోవడం వంటి సమస్యల వల్ల ఎల్.పి.జి సిలిండర్ల కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో గృహావసరాలకు, విద్యాలయాలకు, ఆసుపత్రులకు ఎల్.పి.జి సిలెండర్ల సమస్య ఉత్పన్నం కాకుండా చూసుకునేందుకు జిల్లాస్థాయిలో జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన ఎన్ఫోర్స్మెంట్ కమిటీ ఏర్పాటు చేసి సమన్వయంతో పనిచేస్తూ తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి కలెక్టర్లను సూచించారు. జిల్లాలలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, సిలిండర్ల వినియోగం, సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగు చర్యలు తీసుకోవాలని సూచించారు . గృహావసరాలకు వాడే సిలిండర్లు బ్లాక్ మార్కెట్ కు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని, కమర్షియల్ వినియోగాలకు డొమెస్టిక్ సిలిండర్లు వాడకుండా ఎప్పటికప్పుడు పోలీస్ శాఖ ద్వారా తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఇరిగేషన్ పై సమీక్షిస్తూ రబీ పంటలు కోతలు పూర్తి అయ్యే వరకు రైతులకు సాగు నీటి సమస్య అదేవిధంగా వేసవిలో ప్రజలకు తాగు నీటి సమస్యలు రాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇరిగేషన్ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సాగు తాగునీటికి సమస్యలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బోరు బావుల పై ఆధారపడిన రైతులకు విద్యుత్ సమస్య రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ రైతులు కేవలం వరి పంట సాగు మాత్రమే చేయకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్ళె విధంగా రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్లను సూచించారు. ముఖ్యంగా పామాయిల్ పంటల సాగు విస్తీర్ణం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ……
ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లాలో 250277 ఎల్పిజి కనెక్షన్లు ఉన్నాయని, గృహావసరాలకు వినియోగించే ఎల్.పి.జి సిలిండర్ల సమస్య లేదని, గృహావసరాలకు, విద్యాలయాలకు, వైద్య ఆసుపత్రులకు ఎల్.పి.జి సిలిండర్ల సమస్య లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎల్.పి.జి. 15 రోజులకు బదులు 25 రోజులకు సిలిండర్ బుక్ చేసుకునే విధంగా అవకాశం కల్పించడం జరిగింది తప్ప ఎక్కడ సమస్య లేదని తెలిపారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో 411002 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, జవారి , వేరుశెనగ వివిధ రకాల పంట సాగు జరిగిందని, పంట సాగుకు కావలసిన సాగునీటి వినియోగానికి కావలసిన నీటి సరఫరా కి ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ లో 72.4928 టీఎంసీల నీటి నిల్వ ఉందని, రానున్న వేసవికాలంలో జిల్లాలో త్రాగునీటి సాగునీటికి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
రబీ సీజన్ కు సంబంధించి త్వరలో కోతలు ప్రారంభం అవుతాయని అప్పటి వరకు సాగు నీటికి ఎక్కడ సమస్యలు లేవన్నారు. తాగు నీటికి సైతం సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ధాన్యం కొనుగోలు కు సంబంధించి ముందస్తుగానే గోదాములు చూసుకోవడం, అవసరం మేరకు గన్ని బ్యాగులు సమకూర్చుకోవడం వంటి వాటిపై దృష్టి సారిస్తామని కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రులకు వెల్లడించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, అదనపు కలెక్టర్ అమరేందర్, ఇరిగేషన్ సి. ఈ విజయ భాస్కర్ రెడ్డి, ఎస్ .ఈ పార్థసారథి, నీటిపారుదల శాఖ అధికారి మురళి, సివిల్ సప్లై అధికారి నరసింహారావు, వ్యవసాయ అధికారి యశ్వంత్ రావు, హార్టికల్చర్ అధికారి వెంకటేశ్వర్లు బిపిఎల్ డిస్ట్రిబ్యూటర్ సచిన్, తదితరులు పాల్గొన్నారు.
———————-
నాగర్ కర్నూల్ జిల్లా పౌర సంబంధాల అధికారి, ద్వారా జారీచేసింది.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.