Take a fresh look at your lifestyle.

ముస్లిం వెల్ఫేర్ ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణ కార్యక్రమం . హాజరైన తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి

ముద్ర, తాండూర్ ప్రతినిధి :

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కమల్ అతర్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఉచిత టైలరింగ్, కంప్యూటర్ కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించి, అనంతరం 10వ తరగతి పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, ఏఏంసి చైర్మన్ పట్లోళ్ళ నర్సింలు, అసోసియేషన్ ప్రెసిడెంట్ కమల్ అతర్, కౌన్సిలర్ లు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.