Take a fresh look at your lifestyle.

జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు… జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: జిల్లాలో యూరియా నిల్వలు సరిపడా అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి తేలిపారు. యాసంగి సీజన్లో సాగువిస్తీర్ణం,రైతుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని 37,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమగుతుందని ప్రణాళికలు తయారు చేయడం జరిగిందన్నారు.సరఫరా కోసం అన్ని మండలాల్లో సమగ్ర చర్యలు చేపట్టామణి తెలిపారు.మార్కెఫెడ్ ద్వారా యూరియా నిల్వలను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, వ్యవసాయ రైతు సేవా కేంద్రాలు, జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం,రైతు ఉత్పత్తిదారుల సంస్థల ద్వారా రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.జిల్లాలో నిన్నటి అమ్మకాలు పూర్తవగా మండలాల వారీగా జిల్లాలో యూరియా నిల్వలు ఇలా ఉన్నాయని తేలిపారు. మొత్తంగా పెద్దపల్లి జిల్లాలో 3,323 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని పెర్కొన్నారు.అలాగేయూరియా వాడకం ఎక్కువైతే అగ్గితీగెలు సోకె ప్రమాదం ఉందని, కావున జాగ్రత్తగా వాడవలిసిందిగా కోరారు.

ప్రతి మండలంలో సొసైటీలు మరియు ప్రైవేట్ డీలర్ల వద్ద యూరియా నిల్వలను అందుబాటులో ఉంచడమే కాకుండా, సకాలంలో సరఫరా కొనసాగించేందుకు జిల్లా యంత్రాగం కూడా తరచుగా జిల్లాకు యూరియా కేటాయింపుల కోసం వ్యవసాయ శాఖ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని స్పష్టమ్ చేసారు.ఈ యాసంగిలో ఇప్పటి వరకు 30,201 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు వచ్చిందన్నారు.యూరియా సరఫరా అనేది నెల సప్లై ప్లాన్ ప్రకారం ప్రతిరోజు సరఫరా ఉంటుందని,క్రిబ్కో ఆర్‌ఎఫ్‌సిఎల్,ఎన్‍బిసిఎల్ యూరియా మొత్తం 2,500 టన్నులు యూరియా ఈ వారంలో జిల్లాకు రావడం జరిగిందనీ తేలిపారు.రైతులు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరంలేదని,జిల్లా యంత్రాగం,జిల్లా వ్యవసాయ శాఖ యూరియా సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తోందని,ఎటువంటి సమస్యలు ఉన్నా,మీ మండల వ్యవసాయధికారిని సంప్రదించవచ్చనీ తేలిపారు.

Leave A Reply

Your email address will not be published.