అన్యమత చర్చి నిర్మాణం -మున్సిపల్ అనుమతి లేకుండా అక్రమ నిర్మాణం -వికారాబాద్ పట్టణంలో హిందువుల ఇళ్ల మధ్య అక్రమ చర్చి నిర్మాణం -విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు ప్రశాంత్.
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
హిందువుల మనోభావాలను కించ పరుస్తూ కాలనీలో అన్యమత ప్రచారానికి చర్చి నిర్మాణాన్ని చేపడుతున్నారని బజరంగ్ దళ్ జిల్లా అధ్యక్షులు ప్రశాంత్ ఆరోపించారు. వికారాబాద్ పట్టణ పరిధిలోని సూర్య ప్రకాష్ కాలనీలో క్రిస్టియన్లు ఎవరూ లేక పోయినా అన్యమత ప్రచారానికి చర్చి నిర్మించడం తగదని ఆయన పేర్కొన్నారు. పోలీస్ కాలనీలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్రిస్టియన్ ధ్రువ పత్రాలు కలిగిన వారు ఏ ఒక్కరూ లేకున్నా చర్చి నిర్మాణం ఎలా చేపడతారని ఆయన ప్రశ్నించారు. సూర్య ప్రకాష్ నగర్ కాలనీ కమిటీ అనుమతి కానీ మున్సిపల్ అధికారుల అనుమతి కానీ లేకుండా నిర్మాణం కొనసాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు చెప్పే మాటలన్నీ భూటకాలేనని నిరూపించే సంఘటన వికారాబాద్ పట్టణం సూర్య ప్రకాష్ శాటిలైట్ టౌన్షిప్ కాలనిలో చోటు చేసుకుందని పలువురు పేర్కొంటున్నారు. ఈ విషయమై భజరంగ్ దళ్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం
వికారాబాద్ పట్టణం పోలీస్ కాలనీని 2004 సంవత్సరంలో అప్పటి ఎస్పీ సూర్య ప్రకాష్ 45 ఎకరాల భూమిలో పోలీసు అధికారులకు 515 ప్లాట్స్ చేసి సిబ్బందికి కేటాయించారు. ఈ కాలనీలో 2004 సంవత్సరం నుండి ఇప్పటివరకు, ఒక రెండు వందల కుటుంబాలు ఇళ్ళు నిర్మించుకొని నివాసం ఉంటున్నారని, సూర్య ప్రకాష్ కాలనీ లోని సొసైటీ భూమిలో భవిష్యత్ అవసరాలకు, కొంత ఖాళీ స్థలాన్ని వదిలారు. ఈ స్థలంలో మందిరం, మస్జీద్, చర్చ్ నిర్మాణాలకు ఒక్కో కమ్యూనిటీకి 200 గజాల భూమిని వదిలినట్లు అప్పటి కాలనీ కమిటీ తీర్మానించినట్లు తెలిపారు. గత జూన్ మాసంలో సొసైటీ భూమిలోని 400 గజాల భూమిలో సొసైటీ కార్యాలయం పేరుతో చర్చి నిర్మిస్తున్నారని కాలనీ అధ్యక్షులు గిరివాచారి చెప్పి చర్చి పనులు ప్రారంభించారని, అక్టోబర్ మాసంలో అట్టి నిర్మాణంపై శిలువ ఏర్పాటు చేసి చర్చి నిర్మిస్తున్నామని, కాలనీవాసులు పోలీసు సిబ్బంది ఏఆర్ ఎఎస్ఐ లు సంజీవ, ప్రకాష్, నర్సింహులు, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ కలసి తామే నిర్మిస్తున్నట్లు చెప్పడం చర్చనీయాంషమైనదని, కాలనీలో సొసైటీ నిబంధనల ప్రకారం అందరూ కలిసి సొసైటీ తీర్మానం చేసి ఏదైనా పనిని ప్రారంభించాలి, కానీ సొసైటీ కార్యాలయం నిర్మిస్తున్నామని అందరి సభ్యులను నమ్మించి సభ్యులకు తెలుపకుండా, తీర్మానం చేయకుండా కాలనీ సభ్యులను మభ్యపెట్టి చర్చి నిర్మాణం చేప్పట్టిన నలుగురు వ్యక్తులుకు మద్దతు తెలిపిన సొసైటీ అధ్యక్షులు హెడ్ కానిస్టేబుల్ గిరివా చారి, ప్రధాన కార్యదర్శి హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులుపై తగు చర్యలు తీసుకోవాలని, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, మున్సిపల్ కమిషనర్ ని గతంలో కోరినట్లు తెలిపారు. అక్టోబర్ 4న అక్రమంగా చర్చి నిర్మిస్తున్నారని జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ సూర్య ప్రకాష్ కాలనీవాసులు ఫిర్యాదు చేయగా, మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేసిన నోటీసును నిర్మాణం జరుగుతున్న 6 పీట్ల ఎత్తుకు నిర్మించిన గోడకు అతికించి అక్కడ ఉన్న వ్యక్తులకు అందించారు. అయినా నిర్మాణం పనులు ఆగడం లేదు. నిర్మాణం చేపడుతున్న వ్యక్తులు కూడా క్రిస్టియన్ సామాజిక వర్గానికి చెందినవారు కాదు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారని ఆరోపించారు. ఎస్సి రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం పొందిన వ్యక్తులు, వారి పిల్లలఅందరికీ ఎస్సి కుల ధ్రువ పత్రాలు తీసుకుని ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు, ప్రభుత్వ రాయితీలు పొందిన వారు ఉన్నారన్నారు. చర్చిని నిర్మించకుండా అడ్డుపడిన వారి ఇండ్ల పైకి వెళ్లి బెదిరింపులకు పాల్పడం పట్ల హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న అధికారుల నిర్లక్ష్యం వలన నిర్మాణం జరుగుతుందని, రాత్రి వేళలో 11 నుంచి ఉదయం 5 గంటల వరకు రోజు నిర్మాణం పనులు దొంగ చాటుగాఅక్రమ నిర్మాణం కొనసాగిస్తున్నారని ఆరోపించారు. అన్యమత ప్రార్థనలు చేస్తాం ఏం పీక్కుంటారో పీక్కోమని సంజీవతో పాటు ముగ్గురు సభ్యులు కాలనీ వాసులను బెదిరిస్తూ వికారాబాద్ లోని పాస్టర్లతో కలిసి హంగామా సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజకీయ అండ దండలు మాకు ఉన్నాయంటూ, కాలనీ లోని హిందూ సభ్యులను భయబ్రాంతులకు గురి చేసి చర్చిని ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నారని, ఈ నలుగురు వ్యక్తుల కుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించాలని, నిజానికి 30% క్రిస్టియన్ జనాభా కాలనిలో ఉంటే చట్ట ప్రకారం వారికీ ఉన్న క్రిస్టియన్ కులము బీసీ “సీ ” ని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీల సమక్షంలో నిర్ధారణ చేసి ప్రభుత్వం నిబంధనల ప్రకారం మున్సిపల్ అనుమతి పొంది, నిర్మించుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఎస్సి రిజర్వేషన్ పై లబ్ధి పొందుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి తిరిగి చెల్లించేవరకు వదలమని , చట్టం అందరికి సమానమనే ప్రభుత్వ అధికారులు అక్రమాలకు పాల్పడితే ఎలా అని ప్రశ్నించారు. సామాన్య ప్రజలకు ఖానూన్ వర్తిస్తుందని, పోలీసులకు చట్టం చుట్టమా అని ప్రశ్నించారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హిందూ ధార్మిక సంఘాలను ఏకం చేసి ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
మున్సిపల్ అనుమతి లేకుండా నిర్మాణం వద్దు -కాలనీ అధ్యక్షకార్యదర్శులు గిరివాచారి, శ్రీనివాస్
2017- 2019 లలో కాలనీ ప్రజల సౌకర్యార్థం మా కాలనీలోని మిగులు భూమిలో ప్రార్థన మందిరాలు నిర్మించుకునేందుకు హైందవులకు 220 గజాలు, ముస్లింలకు 220 గజాలు, క్రైస్తవులకు 220 గజాలు ఇవ్వాలని తీర్మానించామని, గత కొన్ని నెలలుగా కొందరు క్రైస్తవులు వారికి కేటాయించిన 220 గజాల స్థలంలో చర్చి నిర్మించుకోవడం గమనించామని, మునిసిపల్ శాఖ అనుమతితో నిర్మిస్తున్నారని భావించామని, కాలనీ అధ్యకుడు గిరివా చారి, కార్యదర్శి శ్రీనివాస్ లు తెలిపారు. తాజాగా స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి నోటీసు వచ్చేవరకు ఆ నిర్మాణానికి అనుమతులు లేవని మాకు తెలియలేదన్నారు. ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి ఉంటామని . ఆ కట్టడంపై మున్సిపల్ యంత్రాంగం గాని, ప్రభుత్వాధికారులు గానీ ఎటువంటి చర్య తీసుకున్నా వారికి మా కాలనీ కమిటీ నుండి పూర్తిగా సహకరిస్తామని తెలిపారు.