ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ :
ఇటీవల అనారోగ్యానికి గురై కోలుకుంటున్న TUWJIJU యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు, కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన ‘మన తెలంగాణ’ జర్నలిస్ట్ కొండూరు కృష్ణయ్య శెట్టిని మంగళవారం సాయంత్రం యూనియన్ నాయకులు పరామర్శించారు.
నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షులు విజయ గౌడ్, జిల్లా కార్యదర్శి సురేష్, జిల్లా ప్రచార కార్యదర్శి చీకిరాల పట్టాభి, ఈసీ సభ్యులు జయప్రసాద్, రమణ కుమార్, కల్వకుర్తి సీనియర్ నాయకులు శ్రీనివాస్ ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వారు కృష్ణయ్య శెట్టి త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ధైర్యం చెప్పారు.