తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెటు కు మరియు తెలంగాణ ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలిపిన కరీంనగర్ జేఏసీ నాయకులు
కరీంనగర్ జిల్లా ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ టీఎన్జీవోల సంఘం అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన క్యాష్‌లెస్ హెల్త్ స్కీమ్‌పై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కేబినెట్ మంత్రివర్గానికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
1056 కోట్ల రూపాయల నిధులతో హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం, ఉద్యోగుల వాటాకు సమానంగా ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ ఇవ్వడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలోని సుమారు 17 లక్షల మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఈ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.
అదే విధంగా 7.5 లక్షల మంది ఉద్యోగ పెన్షనర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.1.2 కోట్ల ఉచిత బీమా కల్పించడం పట్ల మరియు 60 సంవత్సరాల లోపు సాధారణ మరణం చెందిన ఉద్యోగులకు రూ.10 లక్షల బీమా వర్తింపజేయడం శుభపరిణామమని అయన అన్నారు.
ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ నిధులను ఇతర సంక్షేమ పథకాల కోసం వినియోగించకుండా, కేవలం ఉద్యోగుల ఆరోగ్య రక్షణ కోసమే ఉపయోగించాలన్నారు. పూర్తిస్థాయి క్యాష్‌లెస్, లిమిట్‌లెస్ వైద్య విధానాన్ని అమలు చేసే విధంగా స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించి, ఉద్యోగులందరికీ ఆరోగ్య డిజిటల్ కార్డులు జారీ చేయాలని కోరారు.
ఉద్యోగులందరూ ఈ హెల్త్ కేర్ ట్రస్ట్ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ, గతంలో పెండింగ్ బకాయిలు, జీపీఎఫ్, ఇన్సూరెన్స్, పెన్షనర్ బెనిఫిట్స్ నిధుల వినియోగంపై ఉన్న అనుమానాల దృష్ట్యా, ఈ ట్రస్ట్ నిధులు కూడా ఇతర అవసరాలకు మళ్లించబడకుండా స్పష్టమైన హామీ ఉండాలని కోరారు.
అదేవిధంగా కరీంనగర్ జిల్లా తరఫున రాష్ట్ర ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ గారికి మరియు టీఎన్జీవోల సంఘం ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేనీ గారికి మరియు జేఏసీ నాయకులు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలపడం జరిగింది
ఈ కార్యక్రమంలో టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి కార్యదర్శి సంగేం లక్ష్మణరావు కేంద్ర సంఘం నాయకులు రాగి శ్రీనివాస్ గూడ ప్రభాకర్ రెడ్డి సర్దార్ హర్మీందర్ సింగ్ గెజిటేడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు మడిపల్లి కాళి చరణ్ కార్యదర్శి ఎడ్ల అరవింద్ రెడ్డి పట్టణ సంఘం అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్ కార్యదర్శి సుమంత్ రావు రూరల్ అధ్యక్షులు వాస్తవిక్ గౌడ్ కార్యదర్శి కోమ్మేర శ్రీనివాస్ రెడ్డి
నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కోట రామస్వామి కార్యదర్శి శంకర్ పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షులు పెండ్యాల కేశవరెడ్డి కార్యదర్శి లింగయ్య మహిళా నాయకులు శారద సునీత జిల్లా నాయకులు రమేష్ గౌడ్ ప్రసాద్ రెడ్డి శంషుద్దీన్ వంశీ కరుణాకర్ కమలాకర్ శంకర్ నారయణ లవ కుమార్ రాజేష్ నరేష్ జియా సంపత్ ప్రదీప్ కొమురయ్య రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు