Take a fresh look at your lifestyle.

ఐ ఎన్ టి యు సి ఆర్జీ-1 జీఎం ఆఫీస్ పిట్ కమిటీ నియామకం

  • నియామక పత్రం అందించిన జనక్ ప్రసాద్.

ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: ఐ ఎన్ టి యు సి ఆర్ జి 1 ఆఫీస్ ఫిట్ కమిటీ సెక్రటరీ గా జబ్బార్ మియా,అసిస్టెంట్ పిట్ సెక్రటరీ గా శేషు కుమార్ లను నియమిస్తూ ఐ ఎన్ టి యు సి సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ నియామక పత్రాన్ని అందజేశారు. గోదావరిఖని జనక్ భవన్ లో ఆర్ జి 1 వైస్ ప్రెసిడెంట్ కచకాయల సదానందం అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో కమిటీ ను ప్రకటించగా నియామక పత్రాన్ని యూనియన్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ వారికి అందజేశారు. ఈ సదర్భంగా వారుమాట్లాడుతూ యూనియన్ బలపేతం,కార్మికుల సంక్షేమం,హక్కుల సాధనకోసం కృషి చేయాలని కోరారు. అనంతరం పిట్ సెక్రటరీ,అసిస్టెంట్ పిట్ సెక్రటరీలు మాట్లాడుతూ వారి నియామకానికి కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి, జనరల్ సెక్రటరీ వికాస్ కుమార్ యాదవ్,వైస్ ప్రెసిడెంట్ వడ్డేపల్లి దాస్,డిప్యూటీ జనరల్ సెక్రటరీలు గడ్డం కృష్ణ,గండ్ర దామోదర్, పోచయ్య,ఫిట్ సెక్రటరీ సంపత్, పరుశురాం,శ్రీనివాస్,వెంకటేష్ , తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.