- ఒకరి పరిస్థితి విషమం ఆసుపత్రికి తరలింపు
అచ్చంపేట, ముద్ర: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పదర మండలం కోడోని పల్లి గ్రామానికి చెందిన సుంకరి సైదమ్మ 35 సంవత్సరాలు వీరమ్మ 55 సంవత్సరాలు వ్యవసాయ పొలంలో పనులకు వెళ్ళినప్పుడు భారీగా ఉరుములు మెరుపుల తో వర్షం పెద్ద శబ్దంతో పిడుగుపాటుకు గురై ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మరణించారు.మరొక మహిళ సుంకరి లక్ష్మమ్మ కు తీవ్ర గాయాలు కాగా హుటాహుటిన చుట్టుపక్కల వారు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ అకాల వర్షాలకు పిడుగుపాటు గురి ఇద్దరు మహిళలు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి