Take a fresh look at your lifestyle.

పార్క్ స్థలాన్ని కాపాడాలి

  • మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోరిన భవాని కాలనీ వాసులు

ముద్ర, గండిపేట్: బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని భవాని కాలనీలో పార్కు స్థలం కబ్జా కోరల్లో చిక్కుకుందని కాలనీవాసులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వివరించారు.ఈ మేరకు మంత్రిని వారు మర్యాదపూర్వకంగా కలిసి పార్కు స్థలం వివాదాన్ని వివరించారు.ఈ మేరకు స్పందించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంబంధిత అధికారులను వివరణ కోరారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..స్థానికంగా కాలనీలలో పార్కులు వాటర్ ట్యాంక్ కమ్యూనిటీ హాల్ కోసం గతంలో వెంచర్ వేసిన సమయంలోనే స్థలం కేటాయించినట్లు గుర్తు చేశారు. అయితే ఈ స్థలంపై కన్నేసిన ఓ వ్యక్తి నకిలీ పత్రాలు సృష్టించి అమ్మినట్లు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.దీంతో పార్కు స్థలం లేకుండా పోతుందని వారు ఆవేదన చెందారు.ఈ మేరకు స్పందించిన మంత్రి చర్యలు తీసుకునేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు వివరించారు.

Leave A Reply

Your email address will not be published.