Take a fresh look at your lifestyle.

ప్రజలు బీఆర్ఎస్ పాలనలను కోరుకుంటున్నారు : కార్తీక్ రెడ్డి

ముద్ర, గండిపేట్ : ప్రజలు తిరిగి బీఆర్ఎస్ పార్టీ పాలన కోరుకుంటున్నారని రాజేంద్రనగర్ నియోజకవర్గం బీ ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్ కార్తీక్ రెడ్డి అన్నారు.శనివారం బల్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలువురు కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు కార్తీక్ రెడ్డి సమక్షంలో బీ ఆర్ఎస్ లో చేరారు.పార్టీలో చేరిన వారికి ఆయన కండువా కప్పి ఆహ్వానించారు.అనంతరం కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ..ప్రజలు కాంగ్రెస్ పాలన మోసాలను గుర్తిస్తున్నారని అన్నారు.కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయిన అందువల్లనే తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైందని అన్నారు.రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి గెలుపొందడం ఖాయమని భీమా వ్యక్తం చేశారు.పార్టీలో చేరిన వారిలో గాజుల చంద్రశేఖర్,శ్రీనివాసరెడ్డి, వెంకటేష్, శ్రావణ్, రాంబాబు, నాగరాజ్ సుభాని, బాలాజీ, నరేష్ మహేష్ గౌడ్, రామ్ కుమార్,రాజులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో బీజేఎంసీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆర్.నాగరాజ్,నాయకులు గంగని రవికుమార్, మహేష్,శాంతకుమార్, రాజకుమార్, శాంతిబాయ్, హాజీ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.