Take a fresh look at your lifestyle.

పెట్టుబడులు చూసి కడుపు మంట – మీడియాతో సీఎం రేవంత్​ రెడ్డి

  • విఫలమైతే పైశాచిక ఆనందం పొందాలనుకున్నారు
  • బీఆర్​ఎస్​, బీజేపీలపై సీఎం రేవంత్​ రెడ్డి ఫైర్​
  • విదేశాల నుంచి పెట్టుబడులు తేవాలన్నది మా ప్రయత్నం
  • గత సర్కార్​ ఇక్కడి నుంచి విదేశాలకు నిధులు తరలించింది
  • విదేశీ పర్యటనతో మేం తెలంగాణ సొమ్మును తిరిగి తీసుకొచ్చాం
  • తెలంగాణ ప్రభుత్వంపై నమ్మకంతో పెట్టుబడులు పెట్టారు
  • హైదరాబాద్​ కుపెట్టుబడులు రాకుండా చేయాలని కుట్ర చేశారు
  • ఎన్నో అపోహలు, అనుమానాలు సృష్టించారు
  • కానీ ఇన్వెస్టర్లు విశ్వాసాన్ని చాటుకున్నారు
  • సింగపూర్‌ ప్రభుత్వంతో కీలక ఒప్పందం చేసుకున్నాం
  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో ఇదో అద్భుత పరిణామం
  • మహారాష్ట్ర సీఎం దావోస్​ లో రిలయన్స్​తో ఒప్పందం చేసుకున్నారు
  • దానిపై కిషన్​ రెడ్డి సమాధానం చెప్పాలి

ముద్ర, తెలంగాణ బ్యూరో :విదేశీ పర్యటనతో తాము రాష్ట్రానికి తీసుకువచ్చిన పెట్టుబడులు చూసి ప్రతిపక్షాల కడుపు, కళ్లు మండుతున్నాయని సీఎం రేవంత్​ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా కేవలం 13 రోజుల్లోనే రూ.1.79లక్ష కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చిన ఘనత ప్రజా ప్రభుత్వానికే దక్కిందన్నారు.మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

గత పాలనలో బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టి లండన్ లో పెట్టుబడులు పెడితే తాము ప్రజల కోసం విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకు వచ్చామని సీఎం చెప్పారు. ఫార్ములా ఈ కార్ రేసులో ప్రజల సొమ్ము కొల్లగొట్టిన బీఆర్​ఎస్​ నేతలు తెలంగాణ సొమ్మును విదేశాలకు పంపి..పెట్టుబడి పెట్టుకున్నారని ఆరోపించారు. ప్రజాధనం దుర్వినియోగం అయిన ఆ వ్యవహారంలో విచారణ సంస్థలు వారిపై కేసులు పెట్టారని స్పష్టం చేశారు. పెట్టుబడులు తెచ్చిన తమను యావత్ తెలంగాణ అభినందిస్తోందన్నారు. తాము దావోస్ కు వెళ్లింది పెట్టుబడుల సాధన కోసమేనని ఇదీ వాళ్లకు మాకు ఉన్న తేడా అన్నారు.తాము దావోస్ వెళ్లింది పెట్టుబడులు తీసుకురావడానికేనని చెప్పారు. విదేశీ సంస్థలు మన దగ్గర సొమ్ము పెడతా అని వచ్చారన్నారు. విదేశాల్లో తాము కంపెనీల కార్యాలయాలకు వెళ్లలేదన్నారు. కంపెనీలు తమ ఆఫీస్‌కి వచ్చి ఒప్పందం కుదుర్చుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

తాము ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీల జాబితా ఇస్తామని పేర్కొన్నారు. కంపెనీలతో చెక్ చేసుకోండి.. పెట్టుబడులు స్వాగతించక పోయినా అక్కసు ఎందుకని ప్రతిపక్షాలను దుయ్యబట్టారు. సంస్థలు ఎక్కడివైనా వారి దగ్గర ఉన్న డబ్బులను మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా అంతిమంగా రాష్ట్రంలో పరిశ్రమలు, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలనేది తమ ప్రభుత్వ ఉద్దేశం అన్నారు. ఇక్కడి సంస్థలను విదేశాలకు తీసుకువెళ్లి పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకుని ప్రచారం చేసుకుంటున్నారని కిషన్ రెడ్డి, కేటీఆర్ చేసిన విమర్శలపై స్పందించిన సీఎం.. మహారాష్ట్రకు చెందిన రిలయన్స్ సంస్థతో మహారాష్ట్ర సీఎం దావోస్ లో కుదుర్చకున్న ఒప్పందాన్ని గుర్తు చేశారు. దీనిపైనా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిఎందుకు ప్రశ్నించడంలేదన్నారు. తాము దావోస్ వెళ్లి విఫలం అవుతే దానిపై పైశాచిక ఆనందం పొందాలనుకున్న ప్రతిపక్షాలకు ఆ అవకాశం ఇవ్వలేదన్నారు. వారి కడుపు మంట అంతా అదేనన్నానరు. తాము విజయంతంగా పెట్టుబడులు ఆకర్షించగలిగామన్నారు. ప్రపంచ దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పెట్టుబడులను చూసి ఓర్వలేకే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి దావోస్ కు వచ్చారనీ పెట్టుబడిదారులు అన్ని అంశాలను బేరీజు వేసుకునే మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టారన్నారు. తెలంగాణలో రూ.1.80 వేల కోట్ల పెట్టుబడులకు ముందుకు వచ్చిన కంపెనీలకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విదేశీ పెట్టుబడుల కోసం అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించడం కోసం దావోస్ వెళ్ళామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 14 నెలల్లో ఇదే అతి పెద్ద విజయమని సీఎం రేవంత్ అన్నారు.

ఆర్ధిక వ్యవస్ధను దెబ్బతీసే కుట్ర..!

తెలంగాణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని కొందరు కుట్రలు పన్నుతున్నారని సీఎం ఆరోపించారు.2004-2014 వరకు అప్పుడు తీసుకున్న నిర్ణయాల మేరకు పెట్టుబడులు వచ్చాయన్నారు.రాజకీయ పరమైన విధానాలను విభేదించినా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపేక్షించామని పేర్కొన్నారు.గత ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు తీసుకుంటే మరింత స్పష్టతతో ముందుకు వెళ్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.పెట్టుబడి దారులకు వేగంగా భూములు అనుమతులు ఇస్తున్నాం..ఉద్యోగావకాశాలు పెంచాలని తమ ఆకాంక్ష అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు వచ్చిన దిగ్గజ కంపెనీలకు కావలసిన భూములు,ఇతర సౌకర్యాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ భవిష్యత్‌లో అత్యంత ఆదాయం కలిగిన రాష్ట్రంగా ఉండాలన్నారు. వన్ ట్రిలియన్ ఏకానమీ కలిగి..దేశంలో తెలంగాణ నంబర్ వన్ గా నిలిచిందని సీఎం పేర్కొన్నారు.సింగపూర్‌‌లో ఓ సంస్థ పదో తరగతి చదివిన తర్వాత విద్యార్ధులను సాంకేతిక నైపుణ్యంలో నిష్ణాతులైన వారిగా రూపొందిస్తుందనీ తాము ఆ సంస్థతో కూడా ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. తెలంగాణ-సింగపూర్ ప్రభుత్వాలు కలిసి పని చేయాలని నిర్ణయించామన్నారు.

Leave A Reply

Your email address will not be published.