Take a fresh look at your lifestyle.

కామ్రేడ్ మల్లు స్వరాజ్యం స్ఫూర్తితో నేటి యువతరం సమాజంలో అసమానతలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు పిలుపు

 

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరవనిత కామ్రేడ్ మల్లు స్వరాజ్యం స్ఫూర్తితో నేటి యువతరం సమాజంలోని ఆర్థిక దోపిడి, అసమానతలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ చుక్క రాములు యువతకు పిలుపునిచ్చారు. గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కార్మిక కర్షక భవనంలో మల్లు స్వరాజ్యం 4వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ నేడు అధికారంలో ఉన్న పాలకులు అసమానతలు పెంచుతూ ఆర్థిక దోపిడికి గురి చేస్తున్నారని సామాన్యులకు సౌకర్యాలు అందుబాటులో లేకుండా చేస్తూ పేదవాడిని మరింత పేదవాడిగా దిగజార్చే విధంగా ఆర్థిక విధానాలు అమలు చేస్తున్నారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాద దేశమైన అమెరికా తన ఆధిపత్యం కోసం స్వతంత్ర దేశాలపై ఆధిపత్యం కోసం పరితపిస్తుంది. ఈ తరుణంలో జరుగుతున్న ఇరాన్ పై యుద్ధం చేస్తుంటే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు మోకరిల్లుతూ మన దేశ అలీన విధానానికి తూట్లు పొడుస్తూ మిత్ర దేశమైన ఇరాన్ పై దాడి చేస్తుంటే జోక్యం చేసుకొని ప్రపంచ శాంతికి మన మోడీ యుద్ధాన్ని ఆపే విధంగ ఎలాంటి ప్రయత్నాలు చేయకపోగా యుద్ధం వల్ల వచ్చిన గ్యాస్ సంక్షోభాన్ని ముందస్తు చూపు లేకపోవడంతో దేశంలోని ప్రజలు అవస్థలు పడుతున్నారని పైగా ఎక్కడ కూడా గ్యాస్ కొరత లేదంటూ బిజెపి నాయకులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇదే అదునుగా చూసుకొని మార్కెట్ లో అదనంగా డబ్బులు దండుకొని గ్యాస్ కంపెనీలు పేదవాళ్ళని దోచుకుంటున్నారన్నారు. ఇప్పటికైనా గ్యాస్ సంక్షోభంతో తలెత్తిన ఆర్థిక వ్యవస్థలోనీ అసమానతలు నివారించడంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని వారన్నారు. వెంటనే తగు చర్యలు తీసుకుని ప్రజల ఆటంకంగా ఉన్న గ్యాస్ వెంటనే సరిపడా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దున్నే వాడికి భూమి కావాలని అసమానతలు పోవాలని పోరాటం చేసిన యువత అగ్రభాగాన నిలిచిందని అందులోని నుండి పుట్టిన మాణిక్యమే మల్లు స్వరాజ్యం అని అలాంటి వీరవనిత స్ఫూర్తితో నేడు యువత సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సమానతలను లేని సమాజం నిర్మాణ కోసం పోరాటంలోకి రావాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కాముని గోపాలస్వామి, రాళ్ల బండి శశిధర్, సందబోయిన ఎల్లయ్య, శెట్టిపల్లి సత్తిరెడ్డి, గొడ్డుపర్ల భాస్కర్, జిల్లా కమిటీ సభ్యులు చొప్పరి రవికుమార్, జాలిగపు శిరీష, దాసరి ప్రశాంత్ నాయకులు కొండం సంజీవ్ కుమార్ బత్తుల అభిషేక్ బాన్ తదితరులు పాల్గొన్నార.

Leave A Reply

Your email address will not be published.