Take a fresh look at your lifestyle.

ఉగాది పరమార్ధం

   ముద్ర ప్రతినిధి, మెదక్:

శిశిరం పిదప అరుదెంచును వాసంతం
వాసంతంలో వనప్రియపు మధుర గానం
మధుర గానముతో వచ్చును ఉగాది సంరంభం
ఉగాదితో తెలుగు వత్సరం ప్రారంభం

ఆధ్యాత్మికతతో త్రుంచు అహంకారం
వినయమే నీకు అలంకారం
ఇకపై సాగించు కొత్త జీవనం
అని తెలియజేయుచున్నది
శ్రీ పరాభవ నామ సంవత్సరం

షడ్రుచుల సమ్మేళనం
ఉగాది పచ్చడి ప్రత్యేకం
కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించవలెనని అందించు సందేశం

ఆదాయ ఫలాల
అదృష్ట సంఖ్యల
పంచాంగ శ్రవణంతో పునీతం
ఆపై పండితుల ఆశీర్వాదం

ఓటమి మిగిల్చు చేదు అనుభవం
గెలుపు తెచ్చును తీపి వసంతం
ఇదే ఉగాది పర్వదిన పరమార్థం

(కానుగు రాధిక.. భూపతి రాజు)
చైర్ పర్సన్ మెదక్ పురపాలక సంఘం

 

Leave A Reply

Your email address will not be published.