Take a fresh look at your lifestyle.

జిల్లా గ్రంధాలయంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక : జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎండి అవైస్ రహమాన్ చిస్తి

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
జిల్లా గ్రంధాలయంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో సోమవారం నుండి 29 వరకు వివిధ ప్రగతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి అవైస్ రహమాన్ చిస్తి తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్ర గ్రంధాలయంలో ఉన్న వివిధ రకాలకు సంబంధించిన పుస్తకాలు, కాంపిటేషన్ పుస్తకాలు వివిధ రకాల తెలుగు ,ఇంగ్లీష్ ,హిందీ ,ఉర్దూ సంబంధించిన పుస్తకములను చూసి పరిశీలించారు. పాఠకులకు కావలసిన కాంపిటేషన్ పుస్తకాలను ఆన్ డిమాండ్ ద్వారా ప్రతినెల వచ్చే విధంగా కృషి చేస్తానన్నారు. జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి సుధీర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క కాంపిటీషన్ పుస్తకాలను తెప్పించుటకు కృషి చేస్తానని అన్నారు. గ్రంథాలయం లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది జంపయ్య, రుకోధర్, శ్రీను, కావ్య, పాఠకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.