Take a fresh look at your lifestyle.

రక్తదానం మహాదానం

 

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి:

రక్తదానం ఎంతో మంది ప్రాణాలను నిలబెడుతుందని, రక్తందానం చేసేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీ యమని గద్వాల మున్సిపల్ చైర్ పర్సన్ తుమ్మల జయలక్ష్మీ నర్సింహులు యాదవ్, వైస్ చైర్మన్ శంకర్, డీసిసి అధ్యక్షులు రాజీవ్ రెడ్డి అన్నారు‌.

 


డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా కి.శే. ముత్యాల వెంకట్ రెడ్డి జ్ఞాపకార్థం ముత్యాల మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో‌ గద్వాల పట్టణం 32వ వార్డు చింతలపేటలో మెగా రక్తదాన శిభిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది పాల్గొన్ని బ్లడ్ డొనేట్ చేశారు. రక్తదాన శిభిరాన్ని గద్వాల్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, డీసిసి అధ్యక్షులతో పాటు కౌన్సిలర్లు ముత్యాల లక్ష్మీ, చంద్రశేఖర్, తదితరులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
రక్తం లేక ఎంతో మంది ఇబ్బంది పడుతుంటారని, సరైన సమయంలో రక్తం ఎక్కించగలిగితే ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో మొదటి గంటలో రక్తం ఇవ్వగలిగితే చాలావరకు ప్రాణా లను కాపాడవచ్చని పేర్కొన్నారు. సైన్స్‌ ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ, రక్తాన్ని కృత్రిమంగా ఎవరూ తయారు చేయలేరని, మనుషుల నుంచి మనిషికి అవసర మయ్యే ఒక విశ్వజనీనత అని గుర్తు చేశారు
అమంతరం ముత్యాల మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో భవిష్యత్ లో అనేక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ట్రస్టు సభ్యులు వీరా రెడ్డి తెలిపారు. అనంతరం రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ క్రాంతి, డిసిసి జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, నాయకులు రవి రెడ్డి, ముత్యాల రవి, శ్రీనివాసులు, వీరారెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.