ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని.. ఆ పండుగ స్ఫూర్తిని ప్రతిబింబించే అగ్రశ్రేణి ఆభరణాల ఎంపికలు తమ వద్ద అందుబాటులో ఉన్నాయని కళ్యాణ్ జ్యువెలర్స్ ప్రకటించింది. సున్నితంగా రూపొందించిన ఆలయ స్ఫూర్తితో కూడిన నెక్లెస్‌లు, దివ్యమైన పెండెంట్ల నుండి సొగసైన గాజులు, పండుగ చెవిపోగుల వరకు, ప్రతి ఆభరణం సాంప్రదాయ హస్తకళను పండుగ వైభవాన్ని ప్రతిబింబిస్తుందని వెల్లడించింది. కొత్త సంవత్సరానికి స్టైల్‌గా స్వాగతం పలకడానికి ఇవి సరైనవని అభిప్రాయపడింది. దేశంలో అనేక ప్రాంతాలలో ఉగాది పండుగ నూతన సంవత్సరానికి నాంది పలుకుతుందనీ ఇది రాబోయే నెలలకు పునరుద్ధరణ, శ్రేయస్సు, ఆశకు ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. ఈ వేడుకల్లో ఆభరణాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుందన్న కళ్యాన్ జ్యువెలర్స్… ఇవి తరచుగా ఆశీర్వాదాలు, వారసత్వం, శాశ్వతమైన సొగసుకు ప్రతీకగా నిలుస్తాయని వెల్లడించింది. పండుగ పూజ సమయంలో ధరించినా, ప్రియమైన వారికి బహుమతిగా ఇచ్చినా, నూతన సంవత్సర ప్రారంభానికి గుర్తుగా జ్ఞాపికగా భద్రపరుచుకున్నా, ప్రతి ఆభరణం కేవలం అలంకరణకు మించిన అర్థాన్ని కలిగి ఉంటుందన్నారు. ఇలాంటి అన్ని రకాల ఆభరణాలు తమ వద్ద అందుబాటులో ఉన్నాయని పేర్కొంది.