Take a fresh look at your lifestyle.

శేరిలింగంపల్లి డివిజన్ అభివృద్ధికి నిధులు కేటాయించాలి

  • జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ కి మతపత్రం అందజేసిన.
  • కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్.

ముద్ర , శేరిలింగంపల్లి -విలేకరి:  శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని శేరిలింగంపల్లి డివిజన్ కు అభివృద్ధికి నిధులు కేటాయించాలని డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మిని జిహెచ్ఎంసి కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ ని జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శేరిలింగంపల్లి డివిజన్ లోని వెజిటేబుల్ మార్కెట్ అభివృద్ధి, అలాగే డివిజన్ లోని పలు అభివృద్ధి పనులకు వినతిపత్రం అందజేయడం జరిగిందని, అందుకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సానుకూలంగా స్పందిస్తూ అభివృద్ధి పనులకు సాయిశక్తుల కృషి చేస్తానని హామీ ఇచ్చినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వీరేశం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.