ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని పునః సమీక్షించాలి రంగారెడ్డి జిల్లా టీజీవో అధ్యక్ష కార్యదర్శి డాక్టర్ కె రామరావు, కార్యదర్శి శ్రీనేష్ కుమార్ నోరి
(ముద్ర, ఉమ్మడి రంగారెడ్డిజిల్లా ప్రతినిధి):
ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ ను) సమీక్షించి మరింత పక్కగా అమలుపర్చేలా ప్రభుత్వంతో త్వరలో జరిగే చర్చల్లో నివేదించాలని రంగారెడ్డి జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కె రామారావు, శ్రీనిష్ కుమార్ తమ కేంద్ర కమిటీకి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఈ హెచ్ ఎస్ పై జిల్లా అధికారులు మరియు ఇతరుల నుండి అందిన సూచనలు / ప్రతిపాదనల ఆధారంగా టీజీవో కేంద్ర కమిటీ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావుకు, వినతి పత్రాన్ని సమర్పించారు. ఈహెచ్ఎస్ పైన ప్రభుత్వం తో రాబోయే చర్చలలో మా వినతులను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వానికి ప్రతిపాదనలను నివేదించాలని వారు కోరారు.