32వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి భూషపాక అండాలను భారీ మెజారిటీతో గెలిపించాలి : గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేస్ చిస్తీ
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి పట్టణంలోని 32 వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూషపాత అందాలను భారీ మెజార్టీతో గెలిపించాలని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అవేస్ చిస్తీ ఓటర్లను కోరారు. శనివారం 32వ వార్డు తారక రామ్ నగర్ లో ఇంటింటా ప్రచారంలో చేయి గుర్తు మీద ఓటు వేసి, సీరియల్ నెంబర్ 2పై అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. సందర్బంగా కౌన్సిలర్ అభ్యర్థి మాట్లాడుతూ నేను ఇక్కడే పుట్టి పెరిగిన గడప గడప నాకు తెలుసు వార్డు ప్రజల కష్ట సుఖాల్లో పాల్గొంటా గడప గడప కు ప్రభుత్వ సంక్షేమ పధకాలు అందించి వార్డు లో ఎటువంటి, సమస్య వచ్చిన ఆపద వచ్చిన ముందుండి పోరాడుతాను వార్డు ప్రజలకు అండగా ఉంటాను అన్నారు. ఒకసారి ఆలోచించి వార్డు ప్రజలు నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.