Take a fresh look at your lifestyle.

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ కు ఏం చేశారో చెప్పాలి -బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు గోపాల్

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :

బడ్జెట్లో వికారాబాద్ కు ఎన్ని నిధులు తీసుకువచ్చారో
స్పీకర్ ప్రసాద్ గడ్డం కుమార్ చెప్పాలని బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు గోపాల్ అన్నారు. సోమవారం వికారాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదన్నారు.
బిఆర్ఎస్ పార్టీ హాయంలో మంజూరైన అభివృద్ధి పనులకే శంకుస్థాపనలు చేస్తున్నారు తప్పా కొత్తగా చేసింది ఏమి లేదన్నారు. స్పీకర్, ముఖ్యమంత్రి ఇద్దరూ వికారాబాద్ జిల్లాకు చెందిన వారై ఉన్నా జిల్లాకు ఇంత అన్యాయమా అని ప్రశ్నించారు. వికారాబాద్ కు బడ్జెట్లో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.

Leave A Reply

Your email address will not be published.