Take a fresh look at your lifestyle.

అక్రమ అరెస్ట్ లతో రాక్షస పాలన -వికారాబాద్ బిజెపి అసెంబ్లీ కోఆర్డినేటర్ వడ్ల నందు

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :

0కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అమలు చేయడం లేదని చేపట్టిన నిరసన కార్యక్రమాలను అడ్డుకుని అక్రమ అరెస్టులు చేయడాన్ని బిజెపి వికారాబాద్ నియోజకవర్గం కోఆర్డినేటర్ వడ్ల నందు విమర్శించారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షులు ఎన్.రాంచందరావు ఇచ్చిన పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న మమ్మల్ని ఇంటికి పోలీసులు వచ్చి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టారన్నారు. అవినీతి, అరాచక, కమిషన్ల పాలనతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న ఈ ప్రభుత్వంపై పోరాటానికి నేడు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్. రామచందర్ రావును, పార్టీ నాయకులను, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజల పక్షాన నిలబడి అసెంబ్లీ ముట్టడికి సిద్ధమైన నాయకులను ముందస్తు అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అన్నారు. ప్రశ్నిస్తే సంకెళ్లా? మీ వైఫల్యాలను ఎండగడితే అరెస్టులతో భయపెట్టాలని చూడటం పిరికిపంద చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు చేసినంత మాత్రాన ప్రజల నుండి, వారి ఆగ్రహం నుండి మీరు తప్పించుకోలేరన్నారు. జైలు గోడలు ప్రజా ఉద్యమాలను ఆపలేవని, ఈ అణచివేత ధోరణి మీ పతనానికి నాంది పలుకుతుందన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన రామచందర్ రావును కార్యకర్తలను ఎటువంటి షరతులు లేకుండా వెంటనే విడుదల చేయాలి డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కొత్రేపల్లి కౌన్సిలర్ స్రవంతి శ్యాంరెడ్డి, పెండ్లిమడుగు సర్పంచ్ సంతోష బుచ్చయ్య, మాజీ సర్పంచ్ బుచ్చి రెడ్డి, మైలార్ దేవరంపల్లి ఉప సర్పంచ్ భర్త బస్వలింగం, మల్లారెడ్డి, రాఘవేందర్, నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.