ముద్ర : కాప్రా:
కాప్రా డివిజన్ పరిధిలోని గోపాల్ రెడ్డి నగర్‌లో రూ.28 లక్షల నిధులతో చేపట్టనున్న రోడ్డు అభివృద్ధి పనులకు ఉప్పల్ నియోజకవర్గ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, ప్రాంత ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ వంటి అభివృద్ధి పనులను దశలవారీగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
ప్రాంత ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ పార్టీ కాప్రా డివిజన్ అధ్యక్షుడు బైరీ నవీన్ గౌడ్ స్థానిక నాయకులు, ప్రజలు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.