Take a fresh look at your lifestyle.

యూజీసీ నెట్ జాబితాలో ‘మెకానికల్ ఇంజనీరింగ్’ను చేర్చాలి ​జేఎన్టీయూ రెక్టార్‌కు స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం వినతి

ముద్ర కూకట్‌పల్లి :

యూజీసీ నిర్వహించే నెట్ (NET) పరీక్షా సబ్జెక్టుల జాబితాలో ‘మెకానికల్ ఇంజనీరింగ్’ను చేర్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం నాయకులు బుధవారం జేఎన్టీయూ రెక్టార్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.
​ఈ సందర్భంగా పరిశోధక విద్యార్థి, విద్యార్థి నాయకుడు జవ్వాజి దిలీప్ మాట్లాడుతూ.. పీహెచ్‌డీ చేస్తున్న విద్యార్థులు ఫెలోషిప్ పొందాలంటే యూజీసీ నెట్ లేదా సీఎస్‌ఐఆర్ నెట్ అర్హత తప్పనిసరి అని, అయితే ఈ జాబితాలో మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్టు లేకపోవడం వల్ల వేలాది మంది పరిశోధక విద్యార్థులు ఫెలోషిప్ దరఖాస్తు చేసుకోలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర ఇంజనీరింగ్ విభాగాలకు ఏదో ఒక సంబంధిత సబ్జెక్టులో పరీక్ష రాసే వెసులుబాటు ఉందని, కానీ మెకానికల్ విద్యార్థులకు ఆ అవకాశం లేక ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన పరిశోధకులు ఆర్థిక భారంతో ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.
​తమ అభ్యర్థనపై స్పందించిన రెక్టార్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్ రెడ్డి.. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, జేఎన్టీయూ తరపున యూజీసీకి అధికారికంగా లేఖ రాస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు సుజయ్, దుర్గాప్రసాద్, ఆర్కే శ్రీనివాస్, సాగర్ నాయక్, జయరామ్, గగన్ కౌశిక్, తనూజ్, భాస్కర్, ధనుంజయ్, ఆనంద్, హరికృష్ణ, ప్రణయ్ చక్రవర్తి, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.