Take a fresh look at your lifestyle.

ఒక్క పుర పీఠం కూడా వదలని రేవంత్..! వడ్డేపల్లి మున్సిపాలిటీపై సీఎం పావులు – కవిత ఫైర్

ఆ ఒక్క పుర పీఠాన్నీ రేవంత్ లాక్కొంటున్నడు
వడ్డేపల్లి మున్సిపాలిటీని హస్తగతం చేసుకునేలా సీఎం పావులు
64 సీట్లు వచ్చినా ఇంకా రేవంత్ కు అగడేందుకూ..?
ఈ వెగటు రాజకీయాలు చేసే బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది
సేవాలాల్, ఆదివాసీ, ఎరుకల తెగల పేరుతో కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలి
 సేవాలాల్ జీవిత చరిత్రను పాఠ్యాశ్యంగా చేర్చాలి జాగృతి అధ్యక్షురాలు కవిత
ముద్ర, తెలంగాణ బ్యూరో :
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జాగృతి తరఫున తాము గెలుచుకున్న ఒక్క పుర పీఠాన్నీ సీఎం రేవంత్ రెడ్డి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. రాష్ట్రంలో 64 సీట్లు వచ్చిన కూడా ఇంకా అగడు ఎందుకని సీఎంను ప్రశ్నించారు. ఈ వెగటు రాజకీయాలు చేసే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందని విమర్శించారు. ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లోకి చేర్చుకొని వెగటు పుట్టేలా చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ కు కూడా ప్రజలు కచ్చితంగా బుద్ది చెబుతారన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం, అడిగే వాళ్లు ఉండకూడదనే ధోరణితో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సేవాలాల్ 287 వ జయంతి వేడుకలను ఆదివారం బంజారాహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బోగ్ బండార్ నిర్వహించి ప్రత్యేక పూజలు చేసిన కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేతలనే సీఎం ముందు కలుస్తున్నారని విమర్శించిన కవిత.. అధికార పార్టీ నేతలను పట్టించుకోవటం లేదని దుయ్యబట్టారు. తన వ్యాఖ్యలపై ఒక్కసారి ఆలోచన చేయాలని అధికార పార్టీ నేతలను కోరారు. మీకు నిధులు రాకపోతే ఓటర్లకు మీరిచ్చిన హామీల సంగతేంటో ఒక్కసారి ఆలోచన చేయాలని కవిత చెప్పారు. సేవాలాల్ పేరుతో, ఆదివాసీల పేరుతో, ఎరుకల తెగ పేరుతో ఏర్పాటు చేస్తామన్న మూడు కార్పొరేషన్లను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం, మహబూబాబాద్ లో ఐటీడీఏ లు పెట్టాల్సిందేనన్నారు. ఐటీడీఏ లలోనే ఉద్యోగాల రిక్రూట్ మెంట్ నిర్వహిస్తామన్న కాంగ్రెస్ నేతలు అధికారంలో వచ్చాకా వాటిని పట్టించుకోవటం లేదని ఆరోపించారు.
సేవాలాల్ జయంతిని జరుపుకోవటం సంతోషంగా ఉందన్న కవిత.. దేశ వ్యాప్తంగా బంజారా జాతి మేలు కోసం కృషి చేసిన సేవాలాల్ జీవిత చరిత్రను దేశ వ్యాప్తంగా పాఠ్యపుస్తకాల్లో పొందుపర్చాలన్నారు. గోర్ భోళి భాషను కచ్చితంగా 8 వ షెడ్యూల్ లో చేర్చాలని డిమాండ్ చేశారు. బంజరాల్లో ఉన్న పేదరికాన్ని నిర్మూలించాలంటే ప్రత్యేక కార్యాచరణతో ప్రత్యేక నిధిని కేటాయించాలని కవిత డిమాండ్ చేశారు. అన్ని పార్టీలు బంజారా శాఖను విభాగంగా పెట్టుకుంటాయన్న కవిత.. జాగృతి మాత్రం తన మెయిన్ బాడీలోనే వర్కింగ్ ప్రెసిడెంట్ గా బంజారా బిడ్డకు అవకాశం ఇచ్చిందన్నారు. వెనుకబడిన జాతిని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. జాగృతిలో బంజారా, ఆదివాసీ రెండు శాఖలను పెట్టుకున్నామన్న కవిత… రెండు వర్గాల అభ్యున్నతి, హక్కుల కోసం పోరాటం చేస్తామని చెప్పారు. జీవో 33 ప్రకారం గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ రెండేళ్లలో అడ్మిషన్లు, ప్రమోషన్లు, ఉద్యోగాల్లో పదిశాతం రిజర్వేషన్లు అమలు చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బంజారాలు, ఆదివాసీల మధ్య పంచాయితీ పెట్టే కుట్ర మానుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు.  బంజారా యువమిత్రులు తండాల్లో వెలుగులు నింపేలా నాయకత్వం చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని కవిత అభిప్రాయపడ్డారు. అందుకు రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో తండాలను గ్రామపంచాయితీలుగా చేసుకున్నప్పటికీ సరైన వసతులు మాత్రం లేవని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి మారాలంటే ప్రతి తండాకు రూ. 25 లక్షలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. తండాల్లో రేషన్ షాప్ లు, గ్రామపంచాయితీ, అంగన్ వాడీలు నిర్మించాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.