Take a fresh look at your lifestyle.

పరకాలలో బలపడుతున్న బిజెపి. టిఆర్ఎస్ కు గుదిబండగా మారిన వైనం.

 

ముద్ర. పరకాల.

పరకాలలో బిజెపి బలపడుతున్న అంచనాలు కనిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలు మొదలు డిసెంబర్లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోను నిన్న జరిగిన పరకాల మున్సిపాలిటీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తన సత్తాను చాటుకుంది. పరకాల నియోజకవర్గం నుండి రెండు పర్యాయాలు బిజెపి శాసనసభ్యుడిగా ఒంటేరు జయపాల్ గెలుపొందారు. నియోజకవర్గం కేంద్రమైన పరకాలలో బిజెపి కొంత బలాన్ని కలిగి ఉంది. అనంతరం జరిగిన అనేక అసెంబ్లీ ఎన్నికలలో నామవాత్రపు ఓట్లను పొంది అటు ప్రజల్లోను ఇటు కార్యకర్తల్లోనూ తీవ్రమైన అసంతృప్తిని ఎదుర్కొంది. ఈ క్రమంలో 2023 డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ ఖాళి ప్రసాద్ రంగప్రవేశంతో బిజెపి తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకునే ప్రయత్నం చేసింది. గత రెండు మూడు పర్యాయాలు 3వేల, 5వేల ఓట్లకు పరిమితమైనా బిజెపి 2023 లో జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా 39 వేల ఓట్లను పొందింది. దాంతో టిఆర్ఎస్ విజయ అవకాశాలకు పూర్తిగా గండి కొట్టినట్లు అయిందని టీఆర్ఎస్ శ్రేణులు భావించాయి. పరకాలలో వైద్య వృత్తిని ప్రారంభించిన డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ ప్రజల్లో విస్తృతమైన సంబంధాలను కలిగి ఉన్నాడు. సామాజికంగా మున్నూరు కాపు కులానికి చెందిన కాళీ ప్రసాద్ నియోజకవర్గంలోని తన సామాజిక వర్గంలోని వ్యక్తులను తనకు మద్దతుగా నిలుపుకొని బిజెపికి అనుకూలంగా ఉన్న క్యాడర్ను ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేశాడు దాంతో కాళీ ప్రసాద్ అత్యధిక ఓట్లను పొంది టిఆర్ఎస్కు తానేంటో నిరూపించుకున్నాడు.

బి ఆర్ ఎస్ విజయ అవకాశాలకు గండి.

పరకాల లో జరిగిన రెండవ మున్సిపల్ ఎన్నికలలో టిఆర్ఎస్ విజయా అవకాశాలను బిజెపి గండి కొట్టింది అన్న పుకార్లు వినిపిస్తున్నాయి. పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులలో 22 మంది అభ్యర్థులను నిలిపి తన సత్తాను నిరూపించుకుంది. పరకాలలో తనకున్న పట్టును నిలుపుకోవడం కోసం బిజెపి తన శక్తులను ఉపయోగించుకొని ముందుకు సాగింది. ఈ క్రమంలో పట్టణంలోని సుమారు 10 వార్డులలో బి ఆర్ ఎస్ విజయవకాశాలను గండి కొట్టిందని ఆ పార్టీ శ్రేణులు నెత్తినోరు బాదుకుంటున్నారు. 22 వార్డులలో పోటీ చేయగా బిజెపి మూడు వార్డులను గెలుపొందగా మరో ఆరేడు వార్డులలో గెలుపు ముంగిట నిలిచింది. మున్సిపాలిటీ ఎన్నికలలో బిజెపి తక్కువ స్థానాలకు పోటీ చేసి ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు పూర్తిగా టిఆర్ఎస్కు పడి ఐదారు వార్డులలో గెలుపొందారని టీఆర్ఎస్ ముఖ్య నాయకులు అంటున్నారు. అనేక ఎన్నికలలో బిజెపి పరకాల నియోజకవర్గం లో తన ప్రతాపాన్ని నిరూపించుకోవడం వివిధ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.