Take a fresh look at your lifestyle.

యూనిటీ ఫార్మసీ కళాశాలలో ఘనంగా ప్రెషర్స్ పార్టీ

 
ముద్ర ప్రతినిధి,భువనగిరి :
యాదాద్రి భువనగిరి జిల్లా లోని రాయగిరి గ్రామంలో గల యూనిటీ ఫార్మసీ కళాశాలలో శుక్రవారం ఫ్రెషర్స్ పార్టీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అంపటి శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రెషర్స్ పార్టీ కార్యక్రమంలో యూనిటీ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ చైర్మన్ ఏ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ చదువుతోపాటు క్రమశిక్షణ అలవర్చుకొని తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఏఐ టెక్నాలజీకి అనుకూలంగా నూతన విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృత కార్యక్రమాలు అందరిని ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో ఏవో సునీత రెడ్డి, పీజీ కళాశాల హెచ్ ఓడి సురేష్ , ఫార్మసీ కళాశాల హెచ్ ఓడి రాజీవ్, ఇస్మాయిల్, అమర్నాథ్, నాగరాజు, అహ్మద్, మహేష్, ప్రియాంక, అమూల్య, పారిజాత, శైలజ, ఉమా, శ్వేత, కృష్ణ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.