Take a fresh look at your lifestyle.

సంక్షేమానికి శ్రీకారం …. 577 గ్రామాలు నాలుగు పథకాలు..  5,84,003 మంది లబ్దిదారులు

  • ఏకకాలంలో ప్రారంభించిన ప్రభుత్వం
  • పథకం మంజూరు పత్రాల అందజేత
  • పథకాల వారీగా లబ్దిదారుల వివరాల ప్రకటన
  • రైతు ‘భరోసా’ కు రూ. రూ. 569 కోట్లు విడుదల 
  • 4.41 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమా
  • రైతుకూలీలు, గూడు లేని పేదలకూ లబ్ధి
  • పదేండ్ల తర్వాత కొత్త రేషన్ కార్డులకు మోక్షం

ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రజా ప్రభుత్వం మరో రికార్డు సృష్టించింది. గణతంత్ర దినోత్సవం తర్వాత రాష్ట్రంలో నాలుగు ప్రతిష్టాత్మకంగా సంక్షేమ పథకాలు ప్రారంభిస్తామని ప్రకటించిన ప్రభుత్వం చెప్పినట్టే తొలి విడతగా 577 గ్రామాల్లో5,84,003 మంది అర్హులకు సంక్షేమ ఫలాలు అందించింది.గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మొత్తం 561 గ్రామాల్లో ఎంపిక చేసిన లబ్ధిదారులకు సీఎం, మంత్రులు,ప్రజా ప్రతినిధులు, అధికారులు కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు.ఆయా పథకాల లబ్ధిదారుల వివరాలను అధికారులు సోమవారం వెల్లడించారు.ఇందులో రైతు భరోసాకు 4,41,911 మంది లబ్ధిదారులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 18,180 మంది లబ్ధిదారులు, 51,912 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇళ్ల కింద 72,406 గృహాలు మంజూరు చేసినట్లు తెలిపారు.ఎంపిక చేసిన లబ్దిదారులకు అర్హత పత్రాలు అందజేస్తున్నారు. మరోవైపు మార్చి 31లోపు అన్ని గ్రామాల్లో అర్హులందరికీ ఈ నాలుగు పథకాలు పూర్తిగా అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రతి గ్రామంలో ఏకకాలంలో ఈ పథకాలు అమలుచేయడం ద్వారా సామాజిక, ఆర్థిక సమానత్వాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తుంది.

రైతు ‘భరోసా’ కు రూ. రూ. 569 కోట్లు విడుదల 

రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు వినిపించింది. పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అందజేస్తున్న రైతు భరోసా పథకానికి సంబంధించి నిధులను రైతుల ఖాతాల్లో నేటి నుంచి జమ చేయడం ప్రారంభించింది. తొలి విడతగా రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 577 గ్రామాల్లో రైతుల ఖాతాల్లో నిధులను జమ చేయడం ప్రారంభించింది. అందుకోసం రూ.569 కోట్ల నగదును విడుదల చేసింది. ఏడాదికి ఎకారానికి రూ.10 వేల నుంచి రూ. 12 వేలకు పెంచిన ఆర్థిక సహయం రైతుల ఖాతాల్లో జమ అవుతున్నది. దాంతో రైతుభరోసా సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అర్హులందరికీ రైతుభరోసా..!

అర్హులైన రైతుల ఖాతాల్లో రైతుభరోసా డబ్బుల జమ చేసే ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తొలివిడతల భాగంగా మండలానికొక గ్రామంలో రైతుభరోసా నిధులు విడుదల చేసినట్లు వివరించారు. ఈ మేరకు సోమవారం 577 మండలాల్లోని 4,41,911 రైతులకు చెందిన 9,48,333 ఎకరాలకు రూ.563 కోట్లు జమచేసినట్లు తెలిపారు. వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయభరోసా నిధుల జమకూడా కొనసాగుతుందని మంత్రి వెల్లడించారు. అర్హులైన ప్రతిరైతుకు రైతుభరోసా నిధులను జమచేస్తామని ఆయన స్పష్టం చేశారు.సాగుయోగ్యం కాని భూముల గుర్తింపు సర్వేకొనసాగుతుందని ఆయన వివరించారు. మార్చి 31లోపు లబ్ధిదారులందరికీ నిధుల జమ పూర్తిచేస్తామని తెలిపారు.ఈ మేరకు ఆయన సోమవారం ప్రకటన విడుదల చేశారు. ఈనెల 26న సీఎం చేతుల మీదుగా ప్రారంభమైన రైతుభరోసా నిధులు జిల్లాలో ప్రతి మండలానికి ఒక్కో గ్రామం చొప్పున మొదట విడుదల చేశామన్నారు.

జిల్లాల వారిగా విడుదలైన నిధుల వివరాలు.

= ఆదిలాబాద్ జిల్లాలో 17 మండలాలలోని 21 గ్రామాలకు చెందిన 6,411 మంది రైతులకు రూ.14.49 కోట్లు

= భద్రాద్రి కొత్తగూడం జిల్లాలో 23 మండలాలోని 25 గ్రామాలకు చెందిన 22,242 రైతులకు రూ.39.07 కోట్లు

= హన్మకొండ జిల్లాలో 12 మండలాలోని 12 గ్రామాలకు చెందిన 12,545 రైతులకు రూ.14.30 కోట్లు

= జగిత్యాల జిల్లాలో 20 మండలాలోని 20 గ్రామాలకు చెందిన 22,242 రైతులకు రూ.39.07 కోట్లు

= జనగామ జిల్లాలో 12 మండలాలోని 12 గ్రామాలకు చెందిన 12,320 రైతులకు రూ.15.91 కోట్లు

= జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 12 మండలాలోని 12 గ్రామాలకు చెందిన 7,073 రైతులకు రూ.8.67 కోట్లు

= జోగులాంబ గద్వాల జిల్లాలో 13 మండలాలోని 13 గ్రామాలకు చెందిన 7,829 రైతులకు రూ.12.47 కోట్లు

= కామారెడ్డి జిల్లాలో 22 మండలాలోని 24 గ్రామాలకు చెందిన 9,062 రైతులకు రూ.8.35 కోట్లు

= కరీంనగర్ జిల్లాలో 15 మండలాలోని 15 గ్రామాలకు చెందిన 14,226 రైతులకు రూ.15.96 కోట్లు

= ఖమ్మం జిల్లాలో 21 మండలాలోని 21 గ్రామాలకు చెందిన 20,802 రైతులకు రూ.28.42 కోట్లు

= కోమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 15 మండలాలోని 19 గ్రామాలకు చెందిన 4,344 రైతులకు రూ.8.62 కోట్లు

= మహబూబాబాద్ జిల్లాలో 18 మండలాలోని 19 గ్రామాలకు చెందిన 14,611 రైతులకు రూ.18.14 కోట్లు

= మహబూబ్ నగర్ జిల్లాలో 16 మండలాలోని 16 గ్రామాలకు చెందిన 14,575 రైతులకు రూ.17.27 కోట్లు

= మంచిర్యాల జిల్లాలో 16 మండలాలోని 17 గ్రామాలకు చెందిన 7,143 రైతులకు రూ.8.72 కోట్లు

= మెదక్ జిల్లాలో 21 మండలాలోని 21 గ్రామాలకు చెందిన 14,833 రైతులకు రూ.14.06 కోట్లు

= మేడ్చల్ జిల్లాలో 5 మండలాలోని 5 గ్రామాలకు చెందిన 2,706 రైతులకు రూ.3.14 కోట్లు

= ములుగు జిల్లాలో 9 మండలాలోని 9 గ్రామాలకు చెందిన 6,678 రైతులకు రూ.8.26 కోట్లు

= నాగర్ కర్నూల్ జిల్లాలో 20 మండలాలోని 20 గ్రామాలకు చెందిన 16,806 రైతులకు రూ.23.05 కోట్లు

= నల్లగొండ జిల్లాలో 31 మండలాలోని 31 గ్రామాలకు చెందిన 35,568 రైతులకు రూ.46.93 కోట్లు

= నారాయణపేట జిల్లాలో 13 మండలాలోని 13 గ్రామాలకు చెందిన 9,348 రైతులకు రూ.13.87 కోట్లు

= నిర్మల్ జిల్లాలో 18 మండలాలోని 18 గ్రామాలకు చెందిన 7,912 రైతులకు రూ.10.56 కోట్లు

= నిజామాబాద్ జిల్లాలో 31 మండలాలోని 31 గ్రామాలకు చెందిన 35,568 రైతులకు రూ.46.93 కోట్లు

= పెద్దపల్లి జిల్లాలో 13 మండలాలోని 13 గ్రామాలకు చెందిన 9,885 రైతులకు రూ.10.14 కోట్లు

= రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 మండలాలోని 12 గ్రామాలకు చెందిన 9,724 రైతులకు రూ.12.26 కోట్లు

= రంగారెడ్డి జిల్లాలో 21 మండలాలోని 21 గ్రామాలకు చెందిన 15,597 రైతులకు రూ.20.32 కోట్లు

= సంగారెడ్డి జిల్లాలో 25 మండలాలోని 25 గ్రామాలకు చెందిన 19,933 రైతులకు రూ.24.15 కోట్లు

= సిద్దిపేట జిల్లాలో 26 మండలాలోని 26 గ్రామాలకు చెందిన 31,170 రైతులకు రూ.36.76 కోట్లు

= సూర్యాపేట జిల్లాలో 23 మండలాలోని 23 గ్రామాలకు చెందిన 29,352 రైతులకు రూ.37.84 కోట్లు

= వికారాబాద్ జిల్లాలో 20 మండలాలోని 20 గ్రామాలకు చెందిన 8,609 రైతులకు రూ.11.18 కోట్లు

= వనపర్తి జిల్లాలో 15 మండలాలోని 15 గ్రామాలకు చెందిన 9,441 రైతులకు రూ.12.25 కోట్లు

= వరంగల్ జిల్లాలో 11 మండలాలోని 11 గ్రామాలకు చెందిన 11,386 రైతులకు రూ.12.86 కోట్లు

యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 మండలాలోని 17 గ్రామాలకు చెందిన 17,576 రైతులకు రూ.26.95 కోట్లు విడుదల చేయడం జరిగిందన్నారు. మొత్తంగా 32 జిల్లాలలోని 563 మండలాలకు చెందిన 577 గ్రామాలలోని 4,41,911 మంది రైతులకు సంబంధించి 9,48,333 ఎకరాల భూమికి, వారి వారి ఖాతాలలో మొత్తం రూ. 569 కోట్లు జమ చేయడం జరిగిందన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా పంట పెట్టుబడి సహాయాన్ని పెంచి రైతు భరోసా పథకాన్ని కూడా మొదలు పెట్టడం జరిగిందని, రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా అందచేస్తామని మంత్రి తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.