Take a fresh look at your lifestyle.

మోత్కూర్ స్మశాన వాటిక లో సరైన వసతులు కల్పించాలి.. -బందెల శ్రీను.

ముద్ర,మోత్కూరు.:
మోత్కూరు స్మశాన వాటికలో మోత్కూర్ పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని
గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కోటి రూపాయలు మంజూరయ్యాయనీ ఎంతో అభివృద్ధి చేశామని అన్నారు.
కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి పనులు చేపట్టడం లేదనిస్మశాన వాటికలో నిత్యం నీళ్లు, వీధిలైట్లు లేవనీ మధ్యలోనే పనులు ఆగిపోయాయనీ ఆవేదన వ్యక్తం చేశారు. స్మశాన వాటికలో ఒక మున్సిపాలిటీ సిబ్బందినీ నియమించాలనీ తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.లేకుంటే రాబోయే రోజుల్లో భారీ ఎత్తున ఊరంతా ఏకమై ధర్నాలు నిరసనలు చేపడుతామని అన్నారు.ఈ కార్యక్రమంలో బొడ్డుపల్లి లక్ష్మణ్ , కూరెళ్ళ సందీప్, కూరెల్ల సతీష్,
రాములు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.