Take a fresh look at your lifestyle.

రోడ్డు ప్రమాదాల నివారణ పకడ్బందీగా చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించడం, విలువైన ప్రాణాలను కాపాడటానికి పకడ్బందీగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు .
మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్, అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ, ట్రాఫిక్ డిఎస్పీ ప్రభాకర్ రెడ్డి,జిల్లా స్థాయి అధికారులు, జాతీయ రహదారుల అధికారులు, ఇంజనీరింగ్, రవాణా అధికారులు ఈ సమీక్షా సమావేశం పాల్గొన్నారు..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో రహదారి భద్రతా చర్యలు కీలకమైనవని అన్నారు.
ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్ మాట్లడుతూ జిల్లా లో వలిగొండ, భువనగిరి మార్గంలో చిన్న చిన్న రోడ్డు పనులు చేయాలని ఆర్ అండ్ బి అధికారులకు తెలిపారు. అవసరం ఉన్నచోట స్పీడ్ లిమిట్ బోర్డ్స్, లైటింగ్, భారికేడింగ్ ఏర్పాటు చేయాలన్నారు. విజయవాడ,వరంగల్ హైవే ప్రమాదాలు జరుగుతుంటాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి శేఖర్ రెడ్డి ,ఆర్ అండ్ బి అధికారి సరిత, ట్రాన్స్పోర్ట్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.