Take a fresh look at your lifestyle.

హెచ్ సియు భూములను కాపాడుకుందాం

  • కొంపల్లి అనంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు

ముద్ర మొయినాబాద్ ,ఏఫ్రిల్03: ఆనాడు ప్రతిపక్ష హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూములను కాపాడుకుందాం అని చెప్పి మరి ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి కి ప్రభుత్వ భూములు కనబడట్లేదని భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంతరెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మొయినాబాద్ మండల్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు దారెడ్డి వెంకటరెడ్డితో కలిసి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ యందు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….. హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ లో 400 ఎకరాల భూములను వేలం వేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను కుతంత్రాలను అడ్డుకొని ప్రభుత్వ భూములను కాపాడుకుందామన్నారు. హెచ్ సి యు భూముల పరిరక్షణకై నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీచార్జిని వారు తీవ్రంగా ఖండించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను మరిపించేందుకే రేవంత్ రెడ్డి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని వారు తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలకు తాగేందుకు మంచినీరు, కరెంటు, రైతుబంధు లాంటి సంక్షేమ పథకాలు అమలు చేయకుండా డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి పై ధ్వజమెత్తారు. బి ఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ హాయంలోనే ప్రజలు అంతా ఆనందంగా ఉన్నారని కాంగ్రెస్ పాలనలో ప్రజలు, రైతులు హరిగోశ పడుతున్నారని వారు ఆరోహించారు. టిఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు ప్రభుత్వ భూములను కాపాడేందుకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు వెనుకాడమని వారు హెచ్చరించారు.

ఈ ప్రెస్ మీట్ యందు ఆ పార్టీ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి, రవి యాదవ్, అంజయ్య గౌడ్,బాలరాజ్, జయంత్, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు మొర శ్రీనివాస్, పిఎసిఎస్సి మాజీ డైరెక్టర్ కృష్ణారెడ్డి, మాజీ ఎంపిటిసి మాణిక్ రెడ్డి, మాజీ సర్పంచ్ సుధాకర్ యాదవ్,ఏఎంసి మాజీ వైస్ చైర్మన్ రవూఫ్, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు బుల్కాపురం రాజు, టిఆర్ఎస్ నాయకులు కృష్ణ, పరమేష్ ఈశ్వర్,శ్రీనివాస్, రాము , శ్రీరాములు, మల్లేష్ యాదవ్, చాకలి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.