Take a fresh look at your lifestyle.

పెండింగ్ చలాన్లను వెంటనే చెల్లించుకొండి

ముద్ర మొయినాబాద్ , ఏప్రిల్ 3 : వాహనదారులు తమ వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను వెంటనే చెల్లించుకోవాలని రాజేం ద్రనగర్ ట్రాఫిక్ ఎస్ఐ ప్రభాకర్ సూచించారు. గురువారం హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి హిమాయాత్ నగర్ చౌరస్తా సమీపంలో రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు గురువారం చెకోపోస్టు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు వాహనాలను తనిఖీ చేశారు.

ఎస్ఐ ప్రభాకర్ మాట్లాడుతూ మైనర్లకు ద్విచక్ర వాహనాలను ఇవ్వవద్దు అని ఇస్తే బండి యజమానితో పాటు మైనర్పై ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవడం హెచ్చరించారు. అలాగే మధ్యంతాగి వాహనాలను నడిపితే వాహనాలను సీజ్ చేయడంతో పాటు వాహనదారులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటించాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమ ౦లో ట్రాఫిక్ సిబ్బంది ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.