Take a fresh look at your lifestyle.

ఇందిరమ్మ ఇంటి (నమూనా) నిర్మాణానికి భూమి పూజ

ముద్ర,వీపనగండ్ల: ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు నిర్మించే ఇందిరమ్మ మోడల్ గృహానికి స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారి లక్ష్మప్ప ఎంపీడీవో శ్రీనివాస్ రావు భూమి పూజ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో ఇల్లు లేని వారిని గుర్తించి లబ్ధిదారులుగా ఎంపిక చేసి ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలను మంజూరు చేయడం జరుగుతుందని మండల ప్రత్యేక అధికారి లక్ష్మప్ప తెలిపారు. లబ్ధిదారులకు నిర్మించే ఇందిరమ్మ ఇంటిని (మోడల్ గృహాన్ని) స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో నిర్మించి లబ్ధిదారులకు చూపించడం జరుగుతుందని, ఇందిరమ్మ ఇంటికి లబ్ధిదారులుగా అర్హులైన వారు ఇదే తరహాలో ఇంటిని నిర్మించుకోవాల్సి వస్తుందని తెలిపారు. గ్రామాలలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోదల బీరయ్య,మండల రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు నారాయణరెడ్డి, నాయకులు రఘునాథ్ రెడ్డి, చక్ర వెంకటేష్, వెంకటస్వామి, రవీందర్ రెడ్డి, గోపి, మహేష్ నాయుడు, నక్క విష్ణు, వెంకటయ్య, వెంకట్ రాజయ్య, బుచ్చన్న తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.