Take a fresh look at your lifestyle.

బాలసదన్ బాలికలకు మంచి వసతులు కల్పించాలి : జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి వి. మాధవి లత

ముద్ర ప్రతినిధి, భువనగిరి :

బాలసదన్ బాలికలకు మంచి వసతులు కల్పించి ఆశ్రమ నిర్వహణ చేయాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి వి. మాధవి లత అన్నారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.జయరాజు సూచనల మేరకు బుధవారం ఆమె భువనగిరిలోని బాలసదన్ ను సందర్శించారు. ఈ సందర్బంగా బాలసదన్ లోని బాలికలతో ముఖాముఖి జరిపి వారికి కల్పిస్తున్న వసతులను పరిశీలించారు. బాలసదన్ లోని సిబ్బందితో మాట్లాడుతూ బాలికల ఆరోగ్యంపై తగు జాగ్రత్తగా వ్యవహారించాలని, వారి అభిరుచుని బట్టి ఆటలు, పాటలు, చిత్రలేఖనం, వ్యాసరచన, ప్రసంగం అంశాలలో, జీవిత నైపుణ్యాలలో మంచి శిక్షణ కల్పించేలా చర్యలను శాఖపరంగా పరిమితులను అనుసరించి తీసుకోవాలని సూచనలు చేశారు.

Leave A Reply

Your email address will not be published.