Take a fresh look at your lifestyle.

తాజ్‌పూర్ లో వైభవంగా సైన్స్ ఫేర్

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి మండలంలోని తాజ్‌పూర్ గ్రామంలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం వైభవంగా సైన్స్ ఫేర్ కార్యక్రమం నిర్వహించారు.
విద్యార్థుల ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. ఈ సైన్స్ ఫేర్‌లో విద్యార్థులు విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన పలు నమూనాలు, ప్రాజెక్టులు ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు.

 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఇంత పెద్ద స్థాయిలో సైన్స్ ఫేర్ నిర్వహించడం అభినందనీయం అని అన్నారు. విద్యార్థులు తమ ప్రాజెక్టుల గురించి స్పష్టంగా, ఆత్మవిశ్వాసంతో వివరించడం చాలా సంతోషాన్ని కలిగించిందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత, పరిశోధనా తత్వం పెరుగుతుందని తెలిపారు. డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామంలో నిర్వహించిన ఈ సైన్స్ ఫేర్ ఇప్పటివరకు ఏ ప్రైవేట్ పాఠశాలలో కూడా ఈ స్థాయిలో జరగలేదని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోవని, ఇక్కడి విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడుతున్నాయని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెంచుకొని తమ పిల్లలను ఇక్కడే చదివించాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో హెచ్ఎం వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్ వరిగంటి కృష్ణ, పంచాయతీ కార్యదర్శి నరేందర్ నాయక్, వార్డు సభ్యులు పల్లెపాటి కృష్ణ, బొమ్మరపు లక్ష్మీ బాల్రాజ్, ఎస్.కె గాలిబియాకుబ్, ఎస్.కె హైమద్, వరిగంటి మానస నాగరాజు, గ్రామ ప్రజలు, అగ్రికల్చర్ విద్యార్థులు, యాదాద్రి మెడికల్ కాలేజ్ డాక్టర్స్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విద్యార్థుల ప్రతిభను ప్రతిబింబించిన ఈ సైన్స్ ఫేర్ గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Leave A Reply

Your email address will not be published.