Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో 18.02 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యం

  • మొక్కలు నాటిన ప్రభుత్వ సలహాదారు పోచారం

బాన్సువాడ, ముద్ర: మన రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవం-2025 కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది 18.02 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యుడు పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచి, ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ‘వన మహోత్సవం-2025’ కార్యక్రమంలో బాగంగా శుక్రవారం బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం 2కోట్ల 75లక్షల ఎకరాలు, ఈ ప్రకృతి మనకు అనుకూలంగా ఉండాలని, అంటే సరైన సమయంలో వర్షాలు పడాలంటే వాతావరణం సమతుల్యం ఉండాలని అన్నారు.ఈ ప్రయత్నంలోనే వనమహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో అత్యధికంగా పంచాయతీరాజ్‌ శాఖ 7 కోట్లు, పురపాలక శాఖ 8 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ మేరకు ఆయా శాఖలు, జిల్లాల వారీగా పలు లక్ష్యాల్ని నిర్దేశించిందని, అటవీ, వ్యవసాయ శాఖలు కూడా కోటి మొక్కలు నాటాలని ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు.అందుకు గాను ప్రతి ఇంటికి ఆరు మొక్కలను ప్రభుత్వం నుండి పంపిణీ చేయనున్నారని, పంపిణీ చేసిన మొక్కలను విద్యార్థినివిద్యార్థులే కాకుండా ఉపాధ్యాయ బృందం, అధికారులు, ప్రతి ఒక్కరు మొక్కలను నాటి ఈ వన మహోత్సవం-2025 కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నానని అన్నారు. కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఇంటర్ బోర్డు జిల్లా అధికారి షేక్ సలాం, అటవీ శాఖ అధికారులు, బాన్సువాడ పట్టణ నాయకులు కృష్ణారెడ్డి, మహ్మద్ ఎజాస్, వహాబ్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.