ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు, జగిత్యాల డీఎస్పీ సూచనలతో శుక్రవారం పట్టణంలో టౌన్ సిఐ కరుణాకర్, ట్రాఫిక్ ఎస్సై మల్లేష్ లు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నెంబర్ ప్లేట్, బండి పత్రాలు సరిగ్గా లేని 70 వాహనాలను గుర్తించి, వాటిని సీజ్ చేసి వారికి చలాన్లు విధించారు. అలాగే వాహనదారులకు నెంబర్ ప్లేట్ కచ్చితంగా అమర్చుకోవాలని కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇకపైన జగిత్యాలలో వాహందారులందరూ నెంబర్ ప్లేట్లు సరిగా ఉండే విధంగా చూసుకుంటూ ట్రాఫిక్ రూల్స్ ని క్రమం తప్పకుండా పాటించాలని పోలీసులు సూచించారు.
