Take a fresh look at your lifestyle.

పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలి. -జర్నలిస్టు నాగరాజు.

మోత్కూరు ముద్ర న్యూస్:

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన పేద ప్రజలకు అందేలా కృషి చేయాలని, 8 వ అవార్డులో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని జర్నలిస్టు గాదెనబోయిన నాగరాజు అన్నారు. శనివారం మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ పన్నాల శ్రీవిద్య శ్రీనివాస్ రెడ్డిలను వార్డులోని రైతులతో కలిసి పూలమాలలు, శాలువాతో పాటు శ్రీవిద్యకు చీరను బహూకరించి ఘనంగా సన్మానించారు. ఎనిమిది వందల పైచిలుకు మెజార్టీతో కౌన్సిలర్ గా గెలుపొందడం గొప్ప విషయం అని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన స్నేహితుడైన పన్నాల శ్రీనివాస్ రెడ్డి డిగ్రీ పూర్తి అయిన తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఉద్యోగం చేసేవాడని, ఉద్యోగం నచ్చక దానికి రాజీనామా చేసి ఊర్లో ఒకవైపు వ్యవసాయం పనులు చేసుకుంటూ మరొక వైపు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనే వాడని తెలిపారు. గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తగా పార్టీ అభివృద్ధికి పని చేసి జిల్లా కాంగ్రెస్ నాయకునిగా ఎదిగాడని తెలిపారు. మార్కెట్ డైరెక్టర్ గా రైతులకు మెరుగైన సేవలు అందిస్తున్నాడని ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి భార్య పన్నాల శ్రీవిద్య కూడా శ్రీనివాస్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని పేద ప్రజల సంక్షేమానికి కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు అవిశెట్టి రాజాలు, అవిశెట్టి నాగరాజు, రిటైర్డ్ ఉద్యోగి నాయిని శంకర్, రైతులు కౌకుంట్ల మల్లారెడ్డి, ఆకుల సాయిలు, సోమ సత్తి, ఎడ్ల చంద్రయ్య, కొప్పుల ప్రేమా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.