మోత్కూరు ముద్ర న్యూస్:
ఇటీవల మోత్కూరు మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య, వైస్ చైర్మెన్ పల్లెర్ల వెంకన్న గుప్తా, 8వ వార్డు కౌన్సిలర్ పన్నాల శ్రీవిద్య, శ్రీనివాస్ రెడ్డి గార్లకు బీసీ రిజర్వేషన్ సాధన సమితి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఆత్మీయ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్, మండల అధ్యక్షులు శివార్ల శ్రీనివాస్ యాదవ్, పట్టణ అధ్యక్షులు నిలిగొండ మత్స్యగిరి తదితరులు పాల్గొన్నారు.