Take a fresh look at your lifestyle.

బ్యాంకునే మోసం చేసిన మేనేజర్ రూ. 179.54 కోట్ల రూపాయలు డ్రా ముగ్గురు అరెస్ట్, పరారీలో మేనేజర్

ముద్ర ప్రతినిధి, మెదక్:
కంచె చేను మేసిన చందంగా పనిచేసిన బ్యాంకునే మోసం చేసి 179.54 కోట్ల రూపాయలు డ్రా చేసిన మేనేజర్ సంఘటన జిల్లా కేంద్రం మెదక్ పట్టణంలో చోటు చేసుకుంది.


ఈ కేసులో ముగ్గురిని మంగళవారం అరెస్ట్ చేయగా మేనేజర్ పరారీలో ఉన్నాడు.
డిఎస్పీ ప్రసన్న కుమార్ కథనం ప్రకారం… మెదక్ పట్టణంలో గల ఆదర్శ కో – ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు మేనేజర్ యాదం అనిల్ అతని బార్య, స్నేహుతులు ఇతరుల ఆధార్, పాన్ కార్డులు తీసుకుని వారి పేర్ల మీద నకిలీ బంగారం పెట్టి పెద్ద మొత్తంలో 16 లోన్ లు తీసుకున్నాడు. అలాగే 2 ఎటిఎంల నుండి నగదు డిపాజిట్ చేసే సమయంలో 31.35 లక్షలు నగదును బ్యాంకును మోసం చేసి వాడుకున్నాడు. అయితే 16 అకౌంట్ల ద్వారా వన్ గ్రాం బంగారు నగలను ఒరిజినల్ బంగారంగా చూపి బ్యాంకు నుండి రుణాలు తీసుకున్నాడు. బ్యాంకు అప్రైజర్ శ్రీనివాస చారి నకిలీ బంగారంని తనిఖీ చేసి ఒరిజినల్ అని చెప్పి బ్యాంకు మేనేజర్ కు సహకరించాడు.
మేనేజర్ యాదం అనిల్ స్నేహితుడు సుబ్రహ్మణ్యం, భార్య స్రవంతి ఆధార్, పాన్ కార్డులు వాడుకుని నకిలీ బంగారం పెట్టి లోన్ లు తీసుకుని ఇద్దరు వాడుకున్నారు.
*సైబర్ క్రైం ఫిర్యాదుతో…
మేనేజర్ బార్య స్రవంతి సైబర్ క్రైంకు చేసిన ఫిర్యాదుతో మోసం బయట పడింది. బ్యాంకు అధికారులు ఆమె అకౌంట్ తో పాటు బ్యాంకులో మొత్తం 199 బంగారు రుణాల అకౌంట్లు పరిశీలించారు. ఇందులో 16 దొంగ అకౌంట్ల ద్వారా సుమారు కోటి 79 లక్షలు దొంగ బంగారు నగలపై రుణం తీసుకున్నట్లు తేలింది. దీంతో బ్యాంకు సీఈఓ వెంకట రమణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టౌన్ ఇన్స్పెక్టర్ మహేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. మేనేజర్ యాదం అనిల్ పరారీలో ఉండగా ఆయన బార్య స్రవంతి, మిత్రుడు సుబ్రహ్మణ్యం, అప్రైజర్ శ్రీనివాస్ చారిలను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. మేనేజర్ కోసం ప్రత్యేక పోలీసు బృందం ఏర్పాటు చేశామని డిఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో ఇన్స్పెక్టర్ మహేష్, పోలీసు సిబ్బంది ఉన్నారు.
మేనేజర్ అనిల్ గతంలో మోసం
మేనేజర్ యాదం అనిల్ ఆంధ్రప్రదేశ్ వేలేరుపాడు పోలీస్ స్టేషన్ పరిదిలోని ఎపి గ్రామీణ వికాస్ బ్యాంక్, వేలేరుపాడు బ్రాంచ్ లో పనిచేశాడు. ఆ సమయంలో పోలవరం నిర్వాసితులు, గిరిజనులను మోసం చేసి 11,82,487 డబ్బులు వాడుకుని జైలుకి పోయిన చరిత్ర ఉంది. ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనం ఉన్నట్లు తెలిసింది.

Leave A Reply

Your email address will not be published.