Take a fresh look at your lifestyle.

9,10న సీఎం కప్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
2వ ఎడిషన్ సీఎం కప్-2025 జిల్లాస్థాయి క్రీడాకారుల ఎంపిక ఈ నెల 9,10 న నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి ధనుంజయ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఎంపికైన క్రీడాకారులకు జిల్లాస్థాయిలో భువనగిరి టీజీ రెసిడెన్షియల్ స్కూల్ లో అథ్లెటిక్స్, ఫుట్ బాల్, కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్, యోగా, చెస్, క్యారమ్, కరాటే, బ్యాడ్మింటన్, బేస్ బాల్, బాస్కెట్ బాల్, బాక్సింగ్, సైక్లింగ్, హ్యాండ్ బాల్, జూడో, కిక్ బాక్సింగ్, నెట్ బాల్, స్విమ్మింగ్, వ్రేజ్లింగ్, ఊషూ క్రీడల సబ్ – జూనియర్, జూనియర్, సీనియర్ ఎంపిక జరుగుతుందన్నారు.

Leave A Reply

Your email address will not be published.