Take a fresh look at your lifestyle.

కేసీఆర్ అసలు రంగు బయటపడింది

  • ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

ముద్ర, తెలంగాణ బ్యూరో : కవిత వ్యాఖ్యలతో కేసీఆర్ అసలు రంగు బయటపడిందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. బీజేపీలో బీఆర్‌ఎస్‌ను కలపాలని ఆయన చూసినట్లు బయటపడిందని అన్నారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉన్న ముసుగు తొలగిపోయిందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి 8 సీట్లు రావడానికి బీఆర్ఎస్ పార్టీనే కారణమని అన్నారు. కాంగ్రెస్‌ను దెబ్బ తీయడానికి ఆ రెండు పార్టీలు ఏకమయ్యాయని చెప్పారు. కేసీఆర్ ఎందుకు బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేయాలనుకున్నారో కవిత బయట పెట్టాలని బీర్ల ఐలయ్య కోరారు. కేటీఆర్ బండారాన్ని కవిత బయట పెట్టిందని చెప్పుకొచ్చారు. పార్టీ నుంచి కవితను బయటకు పంపించడానికి కేటీఆర్ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. సొంత చెల్లిని చూసి ఓర్వలేని కేటీఆర్ తెలంగాణ ఆడబిడ్డలను ఎలా గౌరవిస్తారని ప్రశ్నల వర్షం కురిపించారు. కేటీఆర్ దమ్ముంటే కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీతో డీల్‌పైన బీఆర్ఎస్ కార్యకర్తలకు సమాధానం చెప్పాలని కోరారు. కుటుంబాన్ని చక్కపెట్టుకోలేని కేటీఆర్.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురించి మాట్లాడుతారా అని బీర్ల ఐలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.