Take a fresh look at your lifestyle.

150 మందికి ఉచిత కంటి, వైద్య పరీక్షలు

రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : లయన్స్ క్లబ్ ఆఫ్ రామకృష్ణాపూర్, మంచిర్యాల గోల్డెన్ జూబ్లీ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత వైద్య,కంటి శిబిరంలో సుమారు 150 మందికి వైద్య పరీక్షలు చేసినట్లు లయన్స్ క్లబ్ ఆఫ్ రామకృష్ణాపూర్ అధ్యక్షుడు గాజుల రాజేష్ కన్నా తెలిపారు. మంగళవారం స్థానిక బీజోన్ గణేష్ మండపం వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో 35 మందికి కంటి ఆపరేషన్ అవసరమన్నారు.వచ్చే సోమవారం రేకుర్తి కంటి ఆసుపత్రికి వారిని తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. జిల్లా విజన్ సెక్రెటరీ సుగుణాకర్ రెడ్డి, డీసీ వెంకటేశ్వర్, లత,కార్యదర్శి పాకాల శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి ఆడెపు లక్ష్మణ్, కిష్టయ్య, జెడ్.సి వేణుగోపాల్, పిజెడ్సి తిరుపతి, పిఆర్సి సుదర్శన్ గౌడ్,సత్యనారాయణ, వెంకటేశం, దేవేందర్ రెడ్డి, సత్యనారాయణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.