Take a fresh look at your lifestyle.

జగిత్యాలలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

  • అమరవీరులకు ఘన నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్, జిల్లా కలెక్టర్.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మొదట ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా ఎస్పి అశోక్ కుమార్, లు జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్మృతి వనంలో అమరవీరులస్థూపం వద్ద తెలంగాణ అమరులకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టరేట్ లో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జాతీయ పతాకాన్ని ఎగరవేసి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల జిల్లాను అభివృద్ధి పథంలో నిలిపేందుకు సమిష్టి కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో జరుగుతున్న పలు సంక్షేమ పథకాలను తెలంగాణ రైజింగ్-2047 కీలకాంశాలు, ఆడ బిడ్డలకు అండదండలు, రైతులకు రుణవిముక్తి, ఎస్సీవర్గీకరణతో సామాజిక న్యాయం, యువతకు ఉపాధి, ఉద్యోగాలు, ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం, విశ్వ వేదికపై తెలంగాణ తదితర అంశాలను వివరించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంతో పాటు జిల్లా పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ పథకావిష్కరణ చేసి పొలిసు గౌరవ వందన స్వీకరించారు. అలాగే అదనపు కలెక్టర్ బిఎస్ లతా క్యాంపు కార్యాలయాల్లో జాతీయ పథకాన్ని, జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జగిత్యాల ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో మధుసూదన్, డిఎస్పి కార్యాలయంలో డిఎస్పి రఘు చందర్, మున్సిపల్ కార్యాలయం పైన మున్సిపల్ కమిషనర్ స్పందన, ఆర్టిసి డిపోలో డిపో మేనేజర్ కల్పన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బిఎస్ లతా, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి, జె డ్పి సిఓ గౌతమ్ రెడ్డి, డిప్యూటీ జెడ్పిసిఓ నరేష్, మాజీ మున్సిపల్ చైర్మన్లు అడువాలా జ్యోతి లక్ష్మణ్, గిరి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.