Take a fresh look at your lifestyle.

పుష్కరాలలో 10 వైద్య శిబిరాల ఏర్పాటు వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ రవీందర్ నాయక్

 

మహాదేవపూర్,ముద్ర:

సరస్వతి అంత్య పుష్కరాలలో కాళేశ్వరం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 10 వైద్య శిబిరాలు మరియు 20 పడకల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన రెండు ఆసుపత్రులను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ రవీంద్ర నాయక్ పరిశీలించారు.సరస్వతి అంత్య పుష్కరాలలో భక్తులకు అందించనున్న వైద్య సేవల ఏర్పాట్లను పర్యవేక్షించడానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్ కాళేశ్వరం క్షేత్రాన్ని సందర్శించారు.సందర్భంగా డాక్టర్ రవీందర్ నాయక్ మాట్లాడుతూ, సరస్వతి అంత్య పుష్కరాలకు భారీగా వచ్చే భక్తులకు సమగ్ర వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే వైద్య శిబిరాలలో అవసరమైన మందులు, సిబ్బంది, అత్యవసర సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.భక్తుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, ములుగు జిల్లా వైద్యాధికారి డాక్టర్ గోపాలరావు, హనుమకొండ జిల్లా వైద్యాధికారి డాక్టర్ అప్పయ్య, ప్రోగ్రాం అధికారులు మరియు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.