Take a fresh look at your lifestyle.

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో సమస్యలను గుర్తించాలి -జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

 ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :

ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో బాగంగా మండల స్తాయిలో మండల సభలు ఏర్పాటు చేయాలనీ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. సోమవారం వీడియో కాన్ఫరెన్సు హాలు నుండి అన్ని మండలాల ఎంపిడిఓలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మండల పరిదిలో ఉన్న అధికారులు మండలంలో ఉన్న సమస్యలను గుర్తించి ప్రభుత్వ ఆదేశాల మేరకు సభలు నిర్వహించాలని, మండలం లో అధికారులు, సర్పంచులు, మండల సమాఖ్య , యూత్ అసోసియేషన్ అందరు సమన్వయంతో పనిచేస్తేనే ప్రోగ్రాం విజయవంతం అవుతుందని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలు రైతు భరోసా, ఇందిరామం ఇండ్లు, మహాలక్ష్మి, మహిళకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ జ్యోతి, సన్నరకం వారికీ బోనస్, చేయూత పెన్షన్లు , కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అన్ని పథకాల లబ్దిదారుల నెంబర్లు లిస్టు ఇవ్వాలని, నూతనంగా అమలు చేయాల్సిన కొత్త పతకాలు అల్ఫాహార పథకం (ఫ్రీ ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు), ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమ పథకం, మధ్యాహ్నం బోజన పథకాలపై వివరించాలని, మండల సభ నిర్వహణకు ప్రోటోకాల్ ప్రకారం అతిదులను ఆహ్వానించాలని, ప్రోటోకాల్ వంద శాతం అమలు చేయాలనీ, మండల సభ నిర్వహణలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలనీ సూచించారు. మండల సమస్యలను గుర్తించి ప్రత్యేక అధికారికి తెలుయజేయాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, జడ్ పి సి ఇ ఓ సుదీర్, జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.