Take a fresh look at your lifestyle.

పీఏసిఎస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరణ

 

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి:
గట్టు మండల కేంద్రంలోని ప్రాథమికవ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్ గా క్యామ వెంకటేష్ బుధవారం తిరిగి బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు తీర్పు మేరకు బాధ్యతలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. మరోమారు రైతులకు సేవ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందని, ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవ చేస్తానని తెలిపారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామని, ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేస్తామన్నారు. రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. రైతులకు సకాలంలో యూరియా, ఎరువులు, విత్తనాలను అందజేస్తూ సొసైటీ బలోపేతం కోసం కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బాద్యతలు స్వీకరించిన అయనను ప్రజా ప్రతినిధులు కార్యాలయ సిబ్బంది శాలువాతో సన్మానించారు.

Leave A Reply

Your email address will not be published.