Take a fresh look at your lifestyle.

పాపిరెడ్డి కాలనీలో సమ్మక-సారలమ్మలను దర్శించుకున్న గాంధీ

ముద్ర, శేరిలింగంపల్లి:
కూకట్పల్లి డివిజన్ పరిధిలోని ఆస్బెస్టాస్ కమాన్ వద్ద పాపిరెడ్డి నగర్ కాలనీ లో గద్దెల పై కొలువుదీరిన సమ్మక్క సారలమ్మ జాతరలో పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని అమ్మవార్ల ను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ గాంధీ మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల ఆశీస్సులు ప్రజలందరి పై ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో కలిసిమెలిసి జీవించాలని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గంధం రాములు, చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి, చిరుమర్తి రాజు, కాశినాథ్ యాదవ్, చర్ల రామకృష్ణారెడ్డి, మహేష్ గౌడ్, అక్కిరెడ్డి, బాల నర్సయ్య, శ్రీకాంత్, గంగుల రాజిరెడ్డి, వావిల్ల బుగ్గయ్య, బాలు యాదవ్, శ్రీధర్ పటేల్, శ్రీనివాస్ రెడ్డి, బాలు, కిషోర్, కిరణ్ రాజేష్, సుధాకర్, టీవీ పద్మ, శోభ రెడ్డి, పద్మ, వెంకటలక్ష్మి, లతా, కవిత, రజిని, ప్రకాష్, వెంకటేష్ మేస్త్రీ, ప్రభాకర్ మరియు ఇతర కాలనీవాసులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.