ముద్ర,పానుగల్ : రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు పానుగల్ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినీలు ఎంపిక అయ్యారని ప్రధాన ఉపాద్యాయులు విజయ లక్ష్మి,ఫిజికల్ డైరెక్టర్(పీడీ) శ్యామల తెలిపారు.పాఠశాలకు చెందిన జ్యోష్ణ,నందిని,గాయత్రి అనే ముగ్గురు విద్యార్థినిలు 34వ కబడ్డీ అసోసియేషన్ గేమ్స్ లో జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయికిఎంపిక అయ్యారన్నారు.ఈ నెల 20 వ తేది నుండి 23వ తేది వరకు వికారాబాద్ లో జరిగేటటువంటి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో పాల్గొంటారన్నారు.ఎంపిక అయిన విద్యార్థినిలకు స్పోర్ట్స్ షూస్ లేనందున హెడ్మాస్టర్ విజయలక్ష్మి, పీడి శ్యామల తమ సొంత ఖర్చులతో స్పోర్ట్స్ షూస్ అందజేశారు. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన ముగ్గురు విద్యార్థినిలను పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించారు